టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా

క్లీన్‌స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో భారత్‌, సిరీస్‌ సమం చేయాలనుకుంటున్న బంగ్లాదేశ్‌

Advertisement
Update:2024-09-27 10:59 IST

కాన్పూర్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్ట్‌ జరగనున్నది. దీనిలోభాగంగా టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. ఇప్పటికే రెండు టెస్ట్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌ గెలిచిన భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉన్నది.వర్షం కారణంగా మైదానం తడిగా ఉండటంతో టాస్‌ ఆలస్యమైంది. 10.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమౌతుందని అంపైర్లు చెప్పారు. అవసరమైతే రోజు చివర్లో 30 నిమిషాల సమయం అదనంగా ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ టెస్ట్‌లోనూ విజయం సాధించి క్లీన్‌ స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో టీమిండియా ఉన్నది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని బంగ్లా చూస్తున్నది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు ఉన్నప్పటికీ.. భారత్‌ మాత్రం ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగింది. మొదటి టెస్ట్‌ ఆడిన జట్టుతోనే రెండోమ్యాచ్‌లోనూ బరిలోకి దిగింది.

తుది జట్లు:

భారత్‌: రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆకాశ్‌ దీప్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

బంగ్లాదేశ్‌: షద్మాన్‌ ఇస్లాం, జాకీర్‌ హసన్‌, నజ్ముల్‌ శాంటో, మొమినుల్‌ హక్‌, ముష్ఫికర్‌ షకిబ్‌, లిటన్‌ దాస్‌, మెహిదీ హసన్‌ మిరాజ్‌, తైజుల్‌, హసన్‌ మహమూద్‌, ఖలేద్‌

Tags:    
Advertisement

Similar News