సెంచరీతో చెలరేగిన కివీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు భారీ లక్ష్యం
లాహోర్ వేదికగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది.;
Advertisement
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు సెంచరీలతో చేలరేగారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర 101 బంతుల్లో 108 పరుగులు రాబట్టగా.. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 94 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. 50 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి కివీస్ 365 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్ బ్రేస్ వెల్ 49 గ్లెన్ ఫిలిప్స్ 44 పరుగులతో రాణించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో కివిస్ బ్యాటర్లు ఇరగదీశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా 363 రన్స్ చేయాల్సి ఉంది.
Advertisement