సయ్యద్‌ మోదీ టైటిల్‌ గెలుచుకున్న పీవీ సింధు .. భారత్ తీన్మార్

సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో భారత దిగ్గజ షట్లర్‌ పీవీ సింధు అదరగొట్టింది. ఏకంగా మూడు టైటిళ్లు గెలిచి భారత షట్లర్లు దుమ్మురేపారు

Advertisement
Update:2024-12-01 19:56 IST

తెలుగు తేజం పీవీ సింధు సయ్యద్‌ మోదీ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన లుయో యు వును 21-14, 21-16 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, సింధు చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్‌లో బీడ‌బ్ల్యూఎఫ్‌ వరల్డ్ టూర్‌లో టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, దాదాపు రెండేళ్ల తర్వాత సింధుకి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. గతంలో 2017, 2022 సంవత్సరాల్లో ఆమె ఈ టైటిల్‌ను గెలిచారు. మ‌రోవైపు, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కూడా భారత్ గెలుచుకుంది. సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జాసన్ తేహ్‌తో త‌ల‌ప‌డిన లక్ష్య సేన్… వరుస గేమ్‌లలో విజృంభించాడు.

21-6, 21-7 పాయింట్ల తేడాతో జియా హెంగ్‌ను చిత్తు చేసిన సేన్.. 28 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్-తెరెసా జాలీ జోడీ విజేతగా నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఈ రెండో సీడ్ భారత జోడీ… 41 నిమిషాల్లో చైనాకు చెందిన లీ జింగ్ బావో – లీ కియాన్‌లను 21-18, 21-11తో ఓడించి టైటిల్ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించింది.

Tags:    
Advertisement

Similar News