ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసక ఇన్నింగ్స్
టీ 20ల్లో వన్డేల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లను చూశాం. కానీ ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు కొట్టిన మొదటి ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
టీ 20ల్లో వన్డేల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లను చూశాం. కానీ ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు కొట్టిన మొదటి ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. విజయ హజారే టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇతను ఈ ఘనత సాధించాడు. ఉత్తరప్రదేశ్ స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ అయిన రుతురాజ్ విరవిహారం చేశాడు. మొదటి 5 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత శివ నో బాల్ వేశాడు.
దాంతో ఫ్రీ హిట్, ఆ తర్వాతి బంతిని కూడా రుతురాజ్ స్టాండ్స్‌లోకి పంపిచాడు. ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. రుతురాజ్ విధ్వంసంతో ఆ ఓవర్‌లో రికార్డు స్థాయిలో 43 పరుగులు వచ్చాయి. ఆ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసి (220)త నాటౌట్‌గా నిలిచాడు. రుతురాజ్ 7 సిక్సర్లతో చెలరేగిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పెట్టింది.
రుతురాజ్ ఈ రేంజ్‌లో విరుచుకుపడడంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చాలా సంతోషంగా. ఎందుకంటే.. త్వరలోనే 2023 ఐపీఎల్‌లో ప్రారంభం కానుంది. రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనర్‌గా ఆడుతున్నాడు. గత రెండేళ్లలో జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఓపెనర్‌గా విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ సీఎస్‌కే విజయాల్లో పాత్ర పోషించాడు.
2007 టీ 20 వరల్డ్‌కప్‌లో భారత ఆటగాడు యువరాజ్ ఇంగ్లండ్ మీద సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. 2007 వన్డే వరల్డ్ కప్‌లోదక్షిణాఫ్రికా ప్లేయర్ హెర్షలీ గిబ్స్ నెదర్లాండ్స్ మీద ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్, శ్రీలంక ఆల్‌రౌండర్ తిషారా పెరీరా కూడా ఈ ఫీట్ సాధించారు.