ప్రతీ క్రికెటర్‌కు మీరే స్ఫూర్తి
సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అందుకొన్నందుకు శుభాకాంక్షలు
బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమం శనివారం ముంబయిలో ఘనంగా జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గాను ఈ అవార్డును సచిన్‌కు అందించడంపై మాజీ ఆలౌరౌండర్ యువరాజ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు.
'కంగ్రాట్స్ మాస్టర్. సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకొన్నందుకు శుభాకాంక్షలు. ప్రతీ క్రికెటర్‌కు మీరే స్ఫూర్తి. కఠినమైన శ్రమతో కలలను నిజం చేసుకోవాలని భావించే మా తరంలోని ప్రతి క్రికెటర్‌కు.. అవిశ్రాంత కృషి, అచంచల నమ్మకంతో కలలు సాకారమౌతాయని మాకు చూపించిన వ్యక్తి మీరే. ఆటపైనే కాకుండా మాపై తీవ్ర ప్రభావం చూపెట్టిన క్రికెటర్. మీతో కలిసి మైదానం పంచుకోవడం గొప్పగా భావిస్తున్నాను. మీ పట్ల ఇదే ప్రేమ, గౌరవం ఎల్లవేళలా ఉంటుందని' యువరాజ్ పోస్ట్ చేశాడు.