ఐదో టీ 20: అభిషేక్ హాఫ్ సెంచరీ
రికార్డుల్లో ఇది రెండో వేగవంతం
నామమాత్రమైన ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటికే 3-1తో సిరీస్ గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విజయంతో ముగించాలనుకుంటున్నది. అయితే చివరిలో గెలిచి వన్డే సిరీస్‌లోకి అడుగుపెట్టాలని ఇంగ్లండ్ భావిస్తున్నది. అయితే ఇంగ్లండ్ బౌలర్లకు టీమిండియా బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ , శాంసన్ దూకుడుగా ఆడారు. రెండు సిక్సర్లు, ఒక బౌండరీతో అదరగొట్టిన శాంసన్ (16) ఔటయ్యాడు. అయితే అభిషేక్ మాత్రం తగ్గేదేలే అంటూ 17 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. వేగవంతమైన హాఫ్ సెంచరీ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డు పరుగులు పెట్టిస్తున్నారు. ఏడు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 127/1 గా ఉన్నది. అభిషేక్ (86*), తిలక్ వర్మ (23*) క్రీజులో ఉన్నారు.