అభిషేక్ సూపర్ సెంచరీ
37 బాల్స్‌లోనే ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు
Advertisement
17 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటిన అభిషేక్ శర్మ వేగవంతమైన హాఫ్ సెంచరీ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అంతటితో ఆగకుండా నా దాహం తీరనిది అన్నట్టు సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి సెంచరీ సాధించాడు. బాల్ ఏదైనా బౌండరీనే అన్నట్టు37 బాల్స్‌లోనే 10 సిక్సులు, 5 ఫోర్లతో ఈ ఫీట్ సాధించాడు. టీ 20 ల్లో వేగంగా సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ (35 బాల్స్) మొదటి స్థానంలో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 270.27 ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు. 12ఓవర్లు ముగిసే సమయానికి భారత స్కోరు 161/3 గా ఉన్నది. భారత బ్యాటర్ల దూకుడు చూస్తుంటే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తున్నది.
Advertisement