భారత్ విజయం.. టీ 20 సిరీస్ కైవసం
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో భారత్ కైవసం
ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ 20 లో టీమిండియా 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్3-1తో కైవసం చేసుకున్నది. భారత్ నిర్దేశించిన 182 రన్స్ టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన ఆరంభంలోనే దూకుడుగా ఆడింది. ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్ వరుస బౌండరీలతో భారత బౌలర్లను బెంబేలెత్తించారు. ఐదు ఓవర్లు ముగిసే సిరికి 53/0 తో పటిష్ట స్థితిలోకి వెళ్లింది. అప్పటికి డకెట్ (37), సాల్ట్ (15) రన్స్‌తో ఆడుతున్నారు. రవి బిష్ణోయ్ వేసిన ఆరో ఓవర్ చివరి బాల్‌కు భారీ షాట్‌కు యత్నించి సూర్యకుమార్ చేతికి చిక్కిన డకెట్ (39) ఔటయ్యాడు. ఏడో ఓవర్లోనే మరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 6.5 బాల్‌కు ఫిలిప్ సాల్ట్ (23) బౌల్డ్ అయ్యాడు. రవి బిష్ణోయ్ వేసిన 7.3 బాల్‌కు ఫ్లిప్ చేసిన బట్లర్ (2) రన్స్‌కే పెవిలియన్ చేరాడు. వికెట్లు కోల్పోతున్నా ఇంగ్లాండ్ దూకుడుగా ఆడటానికే ప్రయత్నించిది. పదో ఓవర్ల వరకు 3 వికెట్లు కోల్పోయి 86 రన్స్ చేసింది. 11 ఓవర్లో హర్షిత్ రాణా వేసిన బాల్‌కు శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి లివింగ్స్టన్ (9) వెనుదిరిగాడు. భారీ షాట్స్ కొడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించిన ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్ (51)కు వరుణ్ చక్రవర్తి కళ్లెం వేశాడు. 14.3 బాల్‌కు అర్ష దీప్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీ జులోకి వచ్చిన కార్సే డకౌట అయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ 133/6 రన్స్ చేసింది. హర్షిత్ రాణా వేసిన 15.5 బాల్‌కు బెతెల్ భారీ షాట్ ఆడి సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 17 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఆర్చర్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చివరి రెండుఓవర్లు ఉత్కంఠగా మారాయి. అప్పటికి ఇంగ్లాండ్ విజయానికి 12 బాల్స్‌లో 25 రన్స్ కావాలి. క్రీజులో ఓవర్టన్ (13), రషీద్ (8) ఉన్నారు. చివరి ఓవర్లో 19 రన్స్ చేయాల్సి ఉండగా.. హర్షిత్ బౌలింగ్ లో ఓవర్టన్ బౌల్డ్ అయ్యాడు. సాఖీబ్ మహ్మద్ ను అర్షదీప్ ఔట్ చేయడతో భారత్ 15 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, వరుణ్ 2, హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 1, అర్ష్‌దీప్ 1 వికెట్ పడగొట్టారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 181 రన్స్చేసింది.