ఆఖరి మ్యాచ్‌లోనూ అదరగొట్టిన టీమిండియా
ఐదు టీ20 ల సిరీస్‌ను భారత్ 4-1 తో కైవసం
Advertisement
సిరీస్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత్ ఆఖరి మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. ముంబయి వాంఖడే స్టేడియంలో ఇవాళ జరిగిన అయిదో టీ 20 లో ఇంగ్లండ్‌పై 150 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 247 రన్స్ చేసింది. 248 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే తడబడింది. 11 ఓవర్లలోనే ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 10.3 ఓవర్లలో 97 ఆలౌట్ అయింది. ఐదు టీ20 ల సిరీస్‌ను భారత్ 4-1 తో కైవసం చేసుకున్నది. ఇంగ్లండ్ టీమ్‌లో ఫీల్ సాల్ట్ 55, జాకబ్ బెతల్ 10 లు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించాడు. వరుణ్ చక్రవర్తి, శివమ్ దుబే, అభిషేక్ శర్మలు రెండేసి వికెట్లు, రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు.
Advertisement