రూ.4.20 కోట్లకు నితీష్ రానాను దక్కించుకున్నరాజస్థాన్ రాయల్స్
భారత ఆల్‌రౌండర్ నితీష్ రానాను రూ.4.20 కోట్లకు దక్కించుకున్నరాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో 72 మంది ఆటగాళ్లును ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్నాయి. భారత ఆల్‌రౌండర్ నితీష్ రానాను రూ.4.20 కోట్లకు దక్కించుకున్నరాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. కృనాల్ పాండ్యాను ఆర్సీబీ రూ.5.75 కోట్లకు దక్కించుకున్నది. వెస్టిండీస్ ఆటగాడు పావెల్‌ను రూ.1.50కోట్లకు సొంతం చేసుకున్న కేకేఆర్.
సౌతాఫ్రికా ఆటగాడు డూప్లెసిస్‌ను రూ.2కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. వాషింగ్టన్ సుందర్‌ను రూ.3.20కోట్లకు గుజరాత్ దక్కించుకున్నది. గత కొన్ని సీజన్లుగా మంచి ఫామ్ లో రాణిస్తున్న ఆల్ రౌండర్లు, బ్యాటర్లను కనీస ధరకు కూడా కొనేందుకు జట్లు ముందుకు రాలేదు. దీంతో గత సీజన్‌లో మంచి ఫామ్ కనభరిచినప్పటికి.. పలువురు కీలక ప్లేయర్లు అమ్ముడుపోలేదు. ఈ జాబితాలో.. మిస్టర్ కూల్ కెప్టెన్ అయిన కేన్ విలియమ్‌సన్, గ్లేన్ ఫలిప్స్, శార్దుల్ ఠాకూర్, జానీ బేయిస్ట్రో, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, పృద్వీ షాలకు మెగా వేలంలో షాక్ తగిలింది. ఇందులో అత్యధికంగా క్యాప్ డు ప్లేయర్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.