ఐపీఎల్ నుండి హ్యారీ బ్రూక్‌ బ్యాన్

ఐపీఎల్ నుండి హ్యారీ బ్రూక్‌ను రెండు సంవత్సరాలు బ్యాన్ చేసిన బీసీసీఐ;

Advertisement
Update:2025-03-13 20:26 IST

ఐపీఎల్ నుండి ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌‌ను రెండు సంవత్సరాలు నిషేధిస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ ఆక్షన్‌లో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌లు ఆడటానికి రాకపోవడంతో హ్యారీ బ్రూక్‌ను బ్యాన్ చేసినట్లు బీసీసీఐ పేర్కొన్నాది. ఐపీఎల్ 2025 నుంచి తాను తప్పుకుంటున్నట్లు హ్యారీ బ్రూక్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఇంగ్లండ్ తరఫున సిరీస్‌ల కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బ్రూక్ చెప్పాడు. ‘నేను చాలా కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నా.

ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఢిల్లీ క్యాపిటల్స్, ఆ ప్రాంచైజీ అభిమానులను క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొల‌గ‌డం ఇది రెండోసారి. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2024లో ఆడలేదు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఆ రూల్స్ ప్ర‌కారం.. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకోకూడదు. సరైన కారణం లేకుంటే.. సదరు ఆటగాడిపై రెండు సీజన్ల పాటు ఐపీఎల్ వేలంలో పాల్గొనకుండా నిషేధం విధించబడుతాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లండ్ ఘోర ఓటమి నేపథ్యంలో జోస్ బ‌ట్ల‌ర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బ‌ట్ల‌ర్ స్థానంలో బ్రూక్ కెప్టెన్‌గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

Tags:    
Advertisement

Similar News