భారత మాజీ క్రికెటర్‌ సయ్యద్‌ అబిద్‌ అలీ కన్నుమూత

హైదరాబాద్‌కు చెందిన లెజెండరీ భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ అమెరికాలో కన్నుమూశారు.;

Advertisement
Update:2025-03-12 18:45 IST

హైదరాబాద్‌కు చెందిన లెజెండరీ భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ అమెరికాలో కన్నుమూశారు.1967-1975 కాలంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన అబిద్ అలీ.. తన కాలంలో మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మీడియం పేసర్‌గా, బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా మంచి ప్రదర్శన కనబర్చారు. రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ తరఫున అదరగొట్టి టిమీండియా జట్టులో చోటు దక్కించుకున్నారు. మాజీ ఆల్‌రౌండర్‌ భారత్‌ తరఫున 29 టెస్టు మ్యాచులు ఆడారు. ఈ మీడియం పేస్‌ బౌలర్‌ 47 వికెట్లు పడగొట్టారు. భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా నిలిచారు. 1967-68లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అబిద్‌ అరంగేట్రం చేశారు. 55 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్ల పడగొట్టి అత్తుమ గణాంకాలను నమోదు చేశారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించారు.

వికెట్ల మధ్య చురుగ్గా కదిలేవారు. అలాగే, బెస్ట్‌ ఫీల్డర్‌గా నిలిచారు. అబిద్ అలీ 1967-68లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై 55 పరుగులు చేసిన ఆయన.. సిక్సర్‌తో తన టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించారు.అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లో 29 మ్యాచులు ఆడిన ఆయన.. 1,018 పరుగులు చేశాడు. ఐదు వన్డేల్లో 93 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యుత్తమ స్కోర్‌ 81, వన్డేల్లో 70. టెస్టుల్లో 47 వికెట్లు తీయగా.. వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో అత్యుత్తమ గణాంకాలు 55 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు. ఇక వన్డేల్లో 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. రంజీల్లో హైదరాబాద్‌ క్రికెట్ జట్టు తరఫున అబిద్ అలీ 2వేల పరుగులు చేసి వంద వికెట్లు తీశారు. 2002-2005 మధ్యకాలంలో యూఏఈ జట్టుకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివాసం ఉంటూ.. స్టాన్‌ఫోర్డ్‌ క్రికెట్‌ అకాడమీలో యువకులకు శిక్షణ ఇస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News