కివీస్‌ చివరి రెండు టెస్టులకు వాషింగ్టన్‌ సుందర్‌

శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ ఫిట్‌నెస్‌పై ఆందోళన నేపథ్యంలో టాప్‌ ఆర్డర్‌ను కవర్‌ చేయడానికి ముందు జాగ్రత్త చర్యలు

Advertisement
Update:2024-10-20 19:58 IST

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో ఓటమి తర్వాత టీమిండియా జట్టులో మార్పులు చేసింది. మిగిలిన రెండు టెస్టులకు వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 24 నుంచి రెండో టెస్ట్‌ పూణె వేదికగా ప్రారంభంకానున్నది. ఈ మ్యాచ్‌కు ముందు సుందర్‌ జట్టుతో కలుస్తాడు. నవంబర్‌ 1 నుంచి ముంబాయి వేదికగా సిరీస్‌లో చివరి (మూడో) మొదలవనున్నది.

వన్‌డౌన్‌ బ్యాటింగ్‌కు దిగి అదరగొట్టిన ఆల్‌రౌండర్‌

స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన వాషింగ్టన్‌ సుందర్‌ భారత్‌ తరఫున ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడాడు. బ్యాటింగ్‌లో 265 రన్స్‌ చేశాడు. బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సుందర్‌ 152 ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాటింగ్‌కు దిగి అదరగొట్టిన ఈ తమిళనాడు ఆల్‌రౌండర్‌ సెలక్టర్‌ దృష్టిని ఆకర్షించాడు. శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ ఫిట్‌నెస్‌పై ఆందోళన నేపథ్యంలో టాప్‌ ఆర్డర్‌ను కవర్‌ చేయడానికి ముందుజాగ్రత్తగా సుందర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం.

కివీస్‌ చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌) జస్‌ప్రీత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మల్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషభ్‌పంత్‌ (కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌పటేల్‌, కుల్‌దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌, వాష్టింగ్టన్‌ సుందర్‌

Tags:    
Advertisement

Similar News