న్యూజిలాండ్‌ టార్గెట్‌ 107 పరుగులు

462 రన్స్‌ కు ఆలౌట్‌ అయిన భారత్‌

Advertisement
Update:2024-10-19 16:49 IST

ఫస్ట్‌ టెస్ట్‌ లో న్యూజిలాండ్‌ ముందు టీమిండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌ లో 462 పరుగులకు భారత్‌ ఆల్‌ ఔట్‌ అయ్యింది. రెండో సెషన్‌ ముగిసే ముందు మొదలైన భారత వికెట్ల పతనం అలాగే కొనసాగింది. మొదటి టెస్ట్‌ నాలుగో రోజు (శనివారం) భారత బ్యాట్స్‌మన్లు సర్ఫరాజ్ అహ్మద్‌, రిషబ్‌ పంత్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేయడంతో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకుంటుందనే అంతా భావించారు. మధ్యలో వర్షం కురవడంతో పిచ్‌ మళ్లీ బౌలింగ్‌ కు అనుకూలంగా మారింది. దీంతో టీమిండియా టీ విరామం తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ 150, రిషబ్‌ పంత్‌ 99 పరుగులతో ఆదుకోవడంతో భారత స్కోర్‌ 400 మార్క్‌ దాటింది. వారి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్లు చేతులెత్తేశారు. లోయర్‌ ఆర్డర్‌ కాసేపు సతాయించినా చివరికి వికెట్లు సమర్పించుకున్నారు. కేఎల్‌ రాహుల్‌ 12, రవిచంద్రన్‌ అశ్విన్‌ 15, రవీంద్ర జడేజా 5, కుల్దీప్‌ యాదవ్‌ ఆరు పరుగులు చేశారు. బూమ్రా, సిరాజ్‌ డకౌట్‌ అయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ, విలియం ఓ రూర్క్‌ మూడేసి వికెట్లు నేల కూల్చారు. అజాజ్‌ పటేల్‌ రెండు, టిమ్‌ సౌథి, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. శనివారం ఆటలో ఇంకో ఓవర్లు మిగిలి ఉన్నాయి.. ఈ రోజు ఇండియా బౌలర్లు కివీస్‌ బ్యాట్స్‌ మన్లను ఎంతమేరకు కట్టడి చేస్తారు అనేదానిపై భారత్‌ విజయం ఆధారపడి ఉంటుంది. ఆదివారం మ్యాచ్‌ లో చివరి రోజు.. చివరి రోజు పిచ్‌ స్పిన్‌ కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారమే మ్యాచ్‌ ముగించాలనే గేమ్‌ ప్లాన్‌ తో కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది.

Advertisement

Similar News