వరుసగా 100 టెస్టులు, నేథన్ లయన్ అరుదైన రికార్డు!
సాంప్రదాయ టెస్టుక్రికెట్లోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. వరుసగా 100 టెస్టులు ఆడిన తొలి స్పిన్నర్ గా కంగారూ బౌలర్ నేథన్ లయన్ అసాధారణ ఘనతను సొంతం చేసుకొన్నాడు.
సాంప్రదాయ టెస్టుక్రికెట్లోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. వరుసగా 100 టెస్టులు ఆడిన తొలి స్పిన్నర్ గా కంగారూ బౌలర్ నేథన్ లయన్ అసాధారణ ఘనతను సొంతం చేసుకొన్నాడు....
ఐదురోజుల సాంప్రదాయ టెస్టు క్రికెట్లో వరుసగా (క్రమం తప్పకుండా ) 100 టెస్టులు ఆడటం అంటే అందరకీ సాధ్యమయ్యే పనికాదు. ఫామ్ లో లేకపోడం, గాయాలు, ఎంపిక సమస్యలు లాంటి కారణాలతో క్రికెటర్లు కొన్ని సమయాలలో టెస్ట్ మ్యాచ్ లకు, సిరీస్ లకు దూరం కాక తప్పదు. అయితే..ఎలాంటి విరామం, విశ్రాంతి లేకుండా..
వరుసగా వందటెస్టులు ఆడిన మొనగాళ్లు చేతివేళ్లమీద లెక్కించదగినంత మంది మాత్రమే ఉన్నారు.
హేమాహేమీల సరసన లయన్...
దశాబ్దాల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్లో వరుసగా వంద టెస్టులు ఆడిన మేటి క్రికెటర్లలో అలీస్టర్ కుక్ ( 159), అలెన్ బోర్డర్ ( 153 ), మార్క్ వా ( 107 ),సునీల్ గవాస్కర్ ( 106 ), బ్రెండన్ మెకల్లమ్ (101 ) మాత్రమే ఉన్నారు. వీరంతా బ్యాటర్లే. అయితే..వరుసగా వంద టెస్టులు ఆడిన తొలిబౌలర్ గా, ఏకైక స్పిన్నర్ గా ఆస్ట్ర్రేలియా స్పిన్ జాదూ, 35 సంవత్సరాల నేథన్ లయన్ చరిత్ర సృష్టించాడు.
2023 యాషెస్ సిరీస్ లో భాగంగా..చారిత్రక లార్డ్స్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న రెండోటెస్టులో పాల్గొనడం ద్వారా నేథన్ లయన్ వరుసగా 100 టెస్టులు ఆడిన ఘనతను సొంతం చేసుకొన్నాడు.
గత 130 ఏళ్లుగా వందలమంది టెస్టు క్రికెట్ ఆడితే..వారిలో ఆరుగురు మాత్రమే వరుసగా వంద టెస్టుమ్యాచ్ లు ఆడటం అసాధారణ రికార్డుగా మిగిలిపోతుంది.
కుటుంబం అండతోనే....
వరుసగా 100 టెస్టులు ఆడగలనని తాను కలలో కూడా ఊహించలేదని, ఇది నిజంగా అబ్బురపరచే రికార్డేనంటూ నేథన్ లయన్ మురిసిపోయాడు. టెస్టు చరిత్రలోనే వందటెస్టులు ఆడిన తొలిబౌలర్ గా నిలవటం తనకు గర్వకారణమని, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, జట్టు సహాయక సిబ్బందితోపాటు తన వ్యక్తిగత శిక్షకుడు టామ్ కార్టర్ల కు ఈ ఘనత చెందుతుందని ప్రకటించాడు.
మ్యాచ్ తర్వాత మ్యాచ్, సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ రావాలంటే శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండితీరాలని, కుటుంబపరంగా తనకు చక్కటి ప్రోత్సాహం ఉందని, అలాగే తన వ్యక్తిగత శిక్షకుడు టామ్ కార్టర్ తనకు అన్నివిధాలుగా దన్నుగా నిలిచిన కారణంగానే ఎలాంటి ఒత్తిడి లేకుండా 100 టెస్టులు క్రమం తప్పకుండా ఆడగలిగానని, మనం జీవితంలో ఏది సాధించాలన్నా చుట్టూ మంచివ్యక్తులు ఉండితీరాలని గుర్తు చేశాడు.
ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ ,33 సంవత్సరాల నేథన్ లయన్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. బ్రిస్బేన్ గబ్బా వేదికగా భారత్ తో ప్రారంభమైన ఆఖరిటెస్టు బరిలోకి దిగడం ద్వారా 100 టెస్టుల మైలురాయిని చేరుకొన్నాడు.
గతంలో ఇదే ఘనత సాధించిన స్టీవ్ వా,జస్టిన్ లాంగర్, షేన్ వార్న్, రికీ పాంటింగ్, బోర్డర్, మెక్ గ్రాత్, క్లార్క్, డేవిడ్ బూన్ తో సహా మొత్తం 12 మంది కంగారూ క్రికెటర్ల సరసన నిలిచాడు. సాంప్రదాయటెస్ట్ క్రికెట్ చరిత్రలో 100 టెస్టులు ఆడిన ఆరో స్పిన్నర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.
ఆరో స్పిన్ బౌలర్ నేథన్ లయన్....
వందటెస్టులు ఆడిన స్పిన్ దిగ్గజాలలో ముత్తయ్య మురళీధరన్ ( 133 టెస్టుల్లో 800 వికెట్లు), షేన్ వార్న్ ( 145 టెస్టుల్లో 708 వికెట్లు ), అనీల్ కుంబ్లే (132 టెస్టుల్లో 619 వికెట్లు), హర్భజన్ సింగ్ (103 టెస్టుల్లో 417 వికెట్లు ), డేనియల్ వెట్టోరీ (113 టెస్టుల్లో 362 వికెట్లు ) ఉన్నారు.
రెండేళ్లక్రితం బ్రిస్బేన్ గబ్బా స్టేడియం వేదికగా భారత్ తో జరిగిన టెస్టు ద్వారా నేథన్ లయన్ 100 టెస్టుల రికార్డును చేరుకోగలిగాడు.
దశాబ్దకాలంలోనే శతక టెస్టులు...
2011 సీజన్లో శ్రీలంక లోని గాల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన లయన్ ఆ తరువాత మరి వెనుదిరిగి చూసింది లేదు. నిలకడగా రాణిస్తూ కంగారూజట్టులో తన స్థానం నిలుపుకొంటూ వచ్చాడు. ఆస్ట్ర్రేలియాకు ప్రధాన స్పిన్నర్ గా కీలక విజయాలు అందించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు.
టెస్టుమ్యాచ్ ల సెంచరీ పూర్తి చేసిన 16వ క్రికెటర్ గా లయన్ 33 సంవత్సరాల వయసులోనే రికార్డుల్లో చేరాడు. అంతేకాదు...షేన్ వార్న్, మెక్ గ్రాత్ ల తర్వాత వందటెస్టులు ఆడిన మూడో ఆస్ట్రేలియన్ టెస్ట్ బౌలర్ గా నిలిచాడు.
ప్రస్తుత యాషెస్ సిరీస్ లోని తొలిటెస్టు వరకూ 122 మ్యాచ్ లు ఆడి 495 వికెట్లు పడగొట్టాడు. మరో ఐదు వికెట్లు సాధించగలిగితే 500 వికెట్ల క్లబ్ లో చోటు సంపాదించగలుగుతాడు. 23సార్లు 5 వికెట్లు, 4సార్లు 10 వికెట్లు చొప్పున పడగొట్టిన రికార్డు కూడా లయన్ కు ఉంది.