ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన లంక క్రికెటర్
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించిన రికార్డులు శ్రీలంక యువ ప్లేయర్ సాధించారు. ఇటీవల జట్టులోకి అరంగేట్రం చేసిన కమిందు మెండిస్. వరల్డ్ రికార్డు సృష్టించాడు
శ్రీలంక స్టార్ క్రికెటర్ కామిందు మెండిస్ ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ సాధించాని రికార్డును సాధించారు. టెస్ట్ క్రికెట్‌లో వరుసగా ఎనిమిది టెస్ట్‌ల్లో 50+స్కొరు సాధించిన తొలి ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. శ్రీలంక వేదికగా న్యూజిలాండ్ తో రెండో టెస్ట్ మ్యాచులో 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించాడు. దీంతో టెస్టుల్లో వరుసగా ఎనిమిది 50 కంటే ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడిగా కమిందు మెండిస్ నిలిచాడు. అతనికంటే ముందు పాకిస్తాన్ కు చెందిన సౌద్ షకీల్.. వరుసగా ఏడు టెస్టుల్లో 50 ప్లస్ స్కోరు చేసిన ప్లేయర్‌గా నిలవగా ప్రస్తుతం ఈ రికార్డును కమిందు మెండిస్ బ్రేక్ చేసి.. సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
రెండో టెస్టు పస్ట్ రోజు కివీస్‌పై శ్రీలంక పైచేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి లంక మూడు వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. అయితే ఆతిథ్య జట్టు లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక (1; 3 బంతుల్లో)ను టిమ్ సౌథి తొలి ఓవర్‌లోనే ఔట్ చేశాడు.అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ చండిమాల్.. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నె (46; 109 బంతుల్లో, 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.