కోల్‌కతా -లఖ్‌నవూ మ్యాచ్‌ రీషెడ్యూల్‌?

ఏప్రిల్‌ 6న శ్రీరామ నవమి రోజున ఊరేగింపులు ఉంటాయి. భద్రతా కారణాల వల్ల మ్యాచ్‌ను రీ షెడ్యూల్‌ చేసే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు;

Advertisement
Update:2025-03-19 10:11 IST

ఐపీఎల్‌-2025 కు మరో మూడు రోజులే మిగిలి ఉన్నది. మార్చి 22న ఈ మెగా లీగ్‌ ప్రారంభం కానున్నది. ఇప్పటికే ఫుల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. అన్ని ఫ్రాంచైజీలు టైటిల్‌ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే ఏప్రిల్‌ 6న కోల్‌కతా నైట్‌రైడర్స్‌-లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌మ్యాచ్‌ జరగాల్సి ఉన్నది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక కానున్నది. కానీ ఆ మ్యాచ్‌ను రీ షెడ్యూల్‌ చేసే అవకాశం కనిపిస్తున్నది.ఎందుకంటే.. ఏప్రిల్‌ 6న (ఆదివారం) శ్రీరామ నవమి ఉన్నది. ఈ పండుగ సందర్భంగా ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఊరేగింపులు జరిగే అవకాశం ఉన్నది. అయితే ఊరేగింపులకు, మ్యాచ్‌కు భద్రత కల్పించడం పోలీసులకు సవాల్‌తో కూడుకున్న పని. అందుకే ఈ మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధం నెలకొన్నది. భద్రతా కారణాల వల్ల మ్యాచ్‌ను రీ షెడ్యూల్‌ చేసే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాం

కాగా,, ఇదే అంశాన్ని తాము బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు లఖ్‌నవూ మేనేజ్‌మెంట్‌ చెప్పింది. భద్రతకు సంబంధించి ఏప్రిల్‌ 6న మ్యాచ్‌ నిర్వహణ విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం. ఇప్పటికే ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాం. గత ఏడాది కూడా ఓ మ్యాచ్‌ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు దాన్ని రీషెడ్యూల్‌ చేశారు అని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా తెలిపారు.

Tags:    
Advertisement

Similar News