ఆరు రోజుల్లో ఐపీఎల్‌-2025.. సెంచరీ చేస్తే కోహ్లీ భారీ రికార్డు

ఐపీఎల్‌-2025 సెంచరీ చేస్తే అత్యధిక సెంచరీలు బాదిన మొదటి టిమిండియా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు;

Advertisement
Update:2025-03-16 14:44 IST

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2025 సీజన్‌ మరో ఆరు రోజుల్లో ప్రారంభకానున్నది. ఇప్పటికే ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మొదలుపెట్టారు. స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఆర్సీబీ క్యాంప్‌లో చేరాడు. ఈ సీజన్‌లో కోహ్లీ ఓ భారీ రికార్డును అందుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. అతను ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఒక్క సెంచరీ చేస్తే టీ 20 క్రికెట్‌లో 10 సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్‌లో ఇన్ని సెంచరీలు చేసిన మొదటి టిమిండియా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 399 మ్యాచ్‌లు ఆడి 9 సెంచరీలు చేశాడు. ఇందులో ఎనిమిది ఐపీఎల్‌లో కాగా.. ఒక అంతర్జాతీయ క్రికెట్‌లో. ఐపీలో అత్యధిక సెంచరీలు చేసింది కోహ్లీనే. 2016 ఐపీఎల్‌లో విరాట్‌ ఏకంగా నాలు సెంచరీలు కొట్టాడు.

టీ20ల్లో ఎక్కువ సెంచరీలు చేసింది వీళ్లే

క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌ 463 మ్యాచ్‌లు)-22

బాబర్‌ అజామ్‌ (పాకిస్థాన్‌, 309 మ్యాచ్‌లు) 11

విరాట్‌ కోహ్లీ (ఇండియా, 399మ్యాచ్‌లు)-9

మైకెల్‌ క్లింగర్‌ (ఆస్ట్రేలియా , 206 మ్యాచ్‌లు )-9

రిలీ రోసోవ్‌ (దక్షిణాఫ్రికా, 367 మ్యాచ్‌లు)-8

ఆరోన్‌ ఫించ్‌ (ఆస్ట్రేలియా,387 మ్యాచ్‌లు)-8

డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా, 399 మ్యాచ్‌లు)-8

జోస్‌ బట్లర్‌ (ఇంగ్లాండ్‌, 434 మ్యాచ్‌లు)-8

రోహిత్‌ శర్మ (ఇండియా, 448 మ్యాచ్‌లు)-8

Tags:    
Advertisement

Similar News