పంత్, అయ్యర్ ఫటాఫట్, భారత్ కు 87 పరుగుల ఆధిక్యం!

రిషభ్ పంత్ 105 బాల్స్ లో 7 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 93 పరుగులు, అయ్యర్ 105 బంతుల్లోనే 10 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 87 పరుగులతో సెంచరీలకు చేరవయ్యారు.

Advertisement
Update:2022-12-23 18:33 IST

పంత్, అయ్యర్ ఫటాఫట్, భారత్ కు 87 పరుగుల ఆధిక్యం!

మీర్పూర్ టెస్టు రెండోరోజుఆటలో భారత్ 87 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యత సంపాదించింది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ జోరుతో భారత్ 314 పరుగుల స్కోరు సాధించగలిగింది....

ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్నరెండుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరిటెస్టు రెండోరోజు ఆటలో సైతం బౌలర్ల హవానే కొనసాగింది.

తొలిఇన్నింగ్స్ లో 227 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్ బౌలర్లు రెండోరోజు ఆటలో భారీస్కోరు చేయనివ్వకుండా భారత్ ను కట్టడి చేయగలిగారు.

పంత్ చేజారిన శతకం...

ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన భారత్...రెండంకెల స్కోర్లకే ఓపెనర్లు రాహుల్ , శుభ్ మన్ గిల్, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా, రెండోడౌన్ విరాట్ కొహ్లీ వెనుదిరిగారు.

రాహుల్ 10, గిల్ 20, పూజారా 24, విరాట్ 24 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతో భారత్ 94 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి చిక్కుల్లో పడింది. అయితే..మిడిలార్డర్ బ్యాటర్లు రిషభ్ పంత్- శ్రేయస్ అయ్యర్ 5వ వికెట్ కు 159 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారీ స్కోరుకు పునాది వేశారు.

రిషభ్ పంత్ 105 బాల్స్ లో 7 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 93 పరుగులు, అయ్యర్ 105 బంతుల్లోనే 10 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 87 పరుగులతో సెంచరీలకు చేరవయ్యారు.

భారత్ 4 వికెట్లకు 226 పరుగుల స్కోరుతో పటిష్టమైన స్థితిలో నిలిచింది.

61 పరుగులకే ఆఖరి 6 వికెట్లు టపటపా....

భారత్ 450 పరుగుల లక్ష్యానికి గురిపెట్టిన సమయంలో బంగ్లా కెప్టెన్ కమ్ స్పిన్ బౌలర్ షకీబుల్ హసన్ మ్యాజిక్ చేశాడు. 93 పరుగులకు పంత్ ను ఆఫ్ స్పిన్నర్ మెహిదీ హసన్, 87 పరుగులకు అయ్యర్ ను షకీబుల్ పడగొట్టడంతో...ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. భారత్ తన చివరి 6 వికెట్లను 61 పరుగుల వ్యవధిలో కోల్పోయి...314 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో భారత్ కేవలం 87 పరుగుల ఆధిక్యతతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అక్షర్ పటేల్ 4, అశ్విన్ 12, ఉమేశ్ 14, సిరాజ్ 7 పరుగులకు అవుట్ కాగా ఉనద్కత్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బంగ్లాబౌలర్లలో తైజుల్, షకీబుల్ చెరో 4 వికెట్లు, టస్కిన్, మెహిదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.

87 పరుగుల తొలిఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాజట్టు 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేయడంతో రెండోరోజు ఆట ముగిసింది.

మొదటి రెండురోజుల ఆటతీరును బట్టి చూస్తే..మ్యాచ్ మొదటి నాలుగురోజుల్లోనే ముగిసిపోడం ఖాయంగా కనిపిస్తోంది.

రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టులో భారత్ 188 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా 1-0తో పైచేయి సాధించగలిగింది.

Tags:    
Advertisement

Similar News