ది బెస్ట్ ఇవ్వాలని ముందు నుంచే కష్టపడ్డా
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడంపై గొంగడి త్రిష ఆనందం
Advertisement
మలేసియాలో జరిగిన అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడంపై గొంగడి త్రిష ఆనందం వ్యక్తం చేశారు. నేడు హైదరాబాద్ చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. గత ఏడాది టోర్నీలో నాకు ఎక్కువ అవకాశం రాలేదు. ఈసారి ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని ముందే అనుకున్నాను. దానికి అనుగుణంగానే కష్టపడ్డాను. మలేసియాలో పిచ్‌లకు తగ్గట్లుగా ముందు నుంచే ప్రాక్టీస్ చేశాం. అందువల్ల సులభంగా గెలవగలిగామన్నారు. అమ్మనాన్నలు, కోచ్, టీమ్ సభ్యుల సహకారంతో ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలిగానని త్రిష అన్నారు.అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న గొంగడి త్రిష, ద్రితి కేసరికి అభిమానులు, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు.
Advertisement