టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మ్యాచ్‌కు దూరంగా విరాట్‌

హర్షిత్‌ రాణా, యశస్వి జైస్వాల్‌ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం

Advertisement
Update:2025-02-06 13:45 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరగనున్నది. నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నది. టీమిండియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది. హర్షిత్‌ రాణా, యశస్వి జైస్వాల్‌ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. హర్షిత్‌ రాణా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్‌లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకోవడంతో వన్డే జట్టులోనూ చోటు దక్కింది.

టీ20 సిరీస్‌న 4-1 తేడాతో గెలుచుకున్న భారత్‌.. అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ రాణించి కప్పు సాధించాలనే పట్టుదలతో ఉన్నది. మరోవైపు కీలకమైన ఛాంపియన్స్‌ ట్రోఫికి ముందు ఎలాగైనా వన్డేల్లో సత్తా చాటాలని ఇంగ్లండ్‌ భావిస్తున్నది. టాస్‌ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌ ఆడటం లేదని తెలిపారు. మోకాలి గాయంతో బాధపడుతున్నాడని.. అందుకే మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిపాడు.  

Tags:    
Advertisement

Similar News