సీఎం రేవంత్ ఆదేశాలు డోంట్ కేర్
గచ్చిబౌలి స్టేడియంలో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈవెంట్
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను స్పోర్ట్స్ అథానిటీ ఆఫ్ తెలంగాణ ఆఫీసర్లు లైట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే మాకేంటి అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. స్టేడియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను క్రీడేతర కార్యక్రమాలకు ఇవ్వబోమని సీఎం రేవంత్ ప్రకటించారు. గచ్చిబౌలి స్టేడియంలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేయించారు. అయినా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎప్పటి మాదిరే వ్యవహరించారు. ఈనెల 19న గచ్చిబౌలి స్టేడియంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈవెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మ్యూజిక్ ఈవెంట్ నిర్వాహకులు స్టేడియంలోని అథ్లెటిక్ ట్రాక్ పై భారీ సెట్ వేశారు. దీని కోసం భారీ గుంతలు తవ్వారు. దీంతో తమ ప్రాక్టీస్ కు అంతరాయం కలుగుతోందని అథ్లెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఆదేశించినా పట్టించుకోకుండా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు మ్యూజిక్ ఈవెంట్‌కు అనుమతి ఇచ్చి అథ్లెటిక్ ట్రాక్ ధ్వంసానికి కారకులయ్యారని మండిపడుతున్నారు.