ధోనీ న్యూ లుక్‌.. కొత్త హెయిర్‌ స్టైల్‌తో హాలీవుడ్ హీరోగా మారిన మాహీ

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించారు. హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు

Advertisement
Update:2024-10-12 14:00 IST

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ న్యూ లుక్‌లో దర్శనమిచ్చారు. హెయిర్ మొత్తం కట్ చేసుకుని యంగ్ కొత్త లుక్‌లో కనిపించాడు. అచ్చం హాలీవుడ్‌ యాక్టర్‌లా కనిపిస్తున్నాడు. ధోనీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను ప్రముఖ హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్ హ‌కిమ్ త‌న ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్‌ ‘హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌.. ‘లుక్‌ అదిరిపోయింది..’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి ప్రత్యేక పరిచం అక్కర్లేదు.

తన హెలికాప్టర్ షాట్‌లతో పాటు సింప్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇక ధోనీ హెయిర్‌ స్టైల్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఎప్పుడూ డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్స్‌తో అభిమానుల్ని ఖుషీ చేస్తుంటాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో లాంగ్‌ హెయిర్‌తో ఉన్న ధోనీ.. ఇప్పుడు కొత్త లుక్‌లోకి మారిపోయాడు. గతంలో లాంగ్ హెయిర్‌తో ఎప్పుడు హల్‌చల్ చేసేవాడు

Tags:    
Advertisement

Similar News