తుది జట్టులో పంత్‌ కష్టమేనా?

అక్షర్‌ పటేల్‌ రూపంలో కొత్త లెఫ్ట్‌హ్యాండర్‌ దొరికినట్లేని భావిస్తున్న క్రికెట్‌ వర్గాలు

Advertisement
Update:2025-02-08 09:57 IST

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు భారత్‌ వన్టే సిరీస్‌ ఆడుతున్నది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం రెండో మ్యాచ్‌ జరుగుతున్నది. తొలి వన్డేలో వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌కు మేనేజ్‌మెంట్‌ తీసుకున్నది. రిషభ్‌ పంత్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. కేఎల్‌ను కాదని అక్షర్‌ పటేల్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపించింది. అతను హాఫ్‌ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసమే ఇలా చేసినట్లు సమాచారం. దీంతో ఇంగ్లండ్‌తో మిగతా వన్డేల్లోనూ అలాగే ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ పంత్‌కు తుది జట్టులో అవకాశాలు రావడం కష్టమేనని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే మిడిలార్డర్‌లో పంత్‌ ఉంటే ప్రత్యర్థులు కొద్దిగా భయపడుతారని.. జట్టును గెలిపించే ఇన్సింగ్స్‌ ఆడటం అతని ప్రత్యేకత అంటూ మరికొందరు కొనియాడారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాల సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నేను ఇంగ్లండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు.. రిషభ్‌ పంత్‌ను ఛాంపియన్స్‌ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని ప్రయత్నించాలని సూచించాను. టాప్‌-7 బ్యాటర్లలో తప్పకుండా లెఫ్ట్‌ హ్యాండ్‌ ప్లేయర్లు ఉండాలి. ఇప్పుడు మొదటి వన్డే తర్వాత అక్షర్‌ పటేల్‌ మంచి ఆప్షన్‌గా అనిపిస్తున్నది. టెస్టుల్లోనూ అతను అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. వన్డేల్లోనూ స్పిన్నర్లపై ఎదురుదాడి చేస్తున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో స్పిన్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉండనున్నది. మిడిలార్డర్‌లో అక్షర్‌ పటేల్‌ సరిపోతాడు. దీంతో బౌలింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. కేఎల్‌ రాహల్‌ మంచి ఫామహలో ఉన్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో తక్కువ స్కోరుకే వెనుదిరిగినంత మాత్రానా టెన్షన్‌ పడాల్సిన పనిలేదు. ఐసీసీ టోర్నీలోనూ ప్రధాన వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ కే అవకాశం రావొచ్చు. రిషభ్‌ పంత్‌కు ఛాన్స్‌లు తక్కవే అని మంజ్రేకర్‌ వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News