రాణించిన బౌలర్లు..టీమిండియా టార్గెట్ ఎంతంటే?
తొలి వన్డేలో ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది.
Advertisement
నాగ్‌పుర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు జాస్ బట్లర్ (52), జాకబ్ (51) అర్ధసెంచరీతో రాణించగా.. ఫిలిప్ సాల్ట్ 43 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, రవీంద్ర జడేజా 3, షమి 1, అక్షర్ పటేల్ 1, కుల్‌దీప్ 1 వికెట్ తీశారు. ఒక దశలో 75/1 పటిష్ఠంగా ఉన్న ఇంగ్లండ్‌ను భారత బౌలర్ హర్షిత్ రాణా దెబ్బతీశారు. ఓకే ఓవర్లో ఇద్దరిని పెవిలియన్ పంపారు.
Advertisement