రెండో వన్డేకు అందుబాటులో విరాట్ కోహ్లీ
ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు మోకాలి నొప్పితో దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డే ఆడనున్నారు.
ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు మోకాలి నొప్పితో దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డే ఆడనున్నారు. భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ..ప్రాక్టీస్‌లో కోహ్లీ బాగానే ఉన్నాడు. అయితే, గాయం అంత సీరియస్ కాదు. అతను కచ్చితంగా రెండో వన్డేకు అందుబాటులోకి వస్తాడు.’ అని తెలిపాడు. ఒకవేళ రెండో వన్డేకు కోహ్లీ అందుబాటులోకి వస్తే అతన్ని తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమే. అప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ శ్రేయస్ అయ్యర్ లేదా యశస్వి జైశ్వాల్‌లలో ఒకరిపై వేటు వేయక తప్పదు. పస్ట్ వన్డేలో కోహ్లీ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీతో సత్తాచాటాడు.
దీంతో కోహ్లీ కోసం జైస్వాల్‌ను తప్పిస్తారా లేక శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెడతారా అనేది తెలియాల్సి ఉంది.గత మ్యాచ్‌లో విరాట్ బ్యాటింగ్ చేసే 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ 87 పరుగులతో రాణించాడు. అయితే, కోహ్లీ తుది జట్టులోకి వస్తే గిల్ తిరిగి ఓపెనర్‌గా వెళ్లక తప్పదు. రేపు కటక్ వేదికగా మ 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.