ఆసీస్‌ ను ఆదుకున్న టెయిలెండర్లు

311 పరుగుల ఆదిక్యంలో ఆస్ట్రేలియా

Advertisement
Update:2024-12-29 12:20 IST

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో టెయిలెండర్లు ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. మిచెల్‌ స్టార్క్‌ 13 బంతల్లో ఐదు పరుగులు మాత్రమే చేసి వెనుదిరగగా, నాథన్‌ లయన్‌, స్కాట్‌ బొలాండ్‌ నిలకడగా ఆడుతున్నారు. లయన్‌ 40 బంతుల్లో రెండు ఫోర్లతో 22 పరుగులు, బొలాండ్‌ 57 బంతుల్లో ఒక ఫోర్‌ తో 9 పరుగులు చేసి క్రీజ్‌ లో ఉన్నారు. చివరి వికెట్‌ కు అజేయంగా 33 పరుగులు జోడించారు. ఆదివారం ఉదయం 85 పరుగులకు నాలుగు వికెట్లతో పటిష్ట స్థితిలో ఉన్న ఆస్ట్రేలియాను జస్ప్రీత్‌ బూమ్రా దెబ్బతీశారు. ఒకే ఓవర్‌ లో ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌ను ఔట్‌ చేసి ఆస్ట్రేలియా మిడిల్‌ ఆర్డర్‌ వెన్ను విరిచారు. కాసేపటికే ఆలెక్స్‌ క్యారీని క్లీన్‌ ఔబల్డ్‌ చేశాడు. 91 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియాను కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఆదుకున్నాడు. లబుషేన్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఏడో వికెట్‌ కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓవరాల్‌ గా ఇండియాపై ఆస్ట్రేలియా 311 పరుగుల ఆదిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆటలో ఇంకో పది ఓవర్లు బాకీ ఉన్నాయి. టీమిండియా త్వరగా పదో వికెట్‌ దక్కించుకుంటే చివరి ఓవర్లలో బ్యాటింగ్‌ ఆరంభించాల్సి ఉంటుంది. ఆదివారంతో పాటు సోమవారం రెండు సెషన్ల పాటు నిలకడగా బ్యాటింగ్‌ చేస్తేనే బాక్సింగ్‌ డే టెస్టులో ఇండియా గెలిచే అవకాశముంటుంది. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌ లో ఇండియా - ఆస్ట్రేలియా 1-1 సమంగా ఉన్నాయి. ఈ టెస్టులో గెలిచే జట్టు బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీని దక్కించుకునే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News