వరల్డ్‌కప్‌లో ఆసీస్ శుభారంభం.. శీలంక చిత్తు
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా అదిరే బోణీ కొట్టింది. షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లుతో ఆసీస్ గెలిచింది.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా అదిరే బోణీ కొట్టింది. షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లుతో ఆసీస్ గెలిచింది. 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని చేదించింది. మొదట పేసర్ మేఘన్ షట్(3/12), యువ స్పిన్నర్ సోఫీ మొలినెక్స్ (2/20)లు చెలరేగడంతో లంకను వంద లోపే కట్టడి చేసిన కంగారూ జట్టు అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.
ఓపెన్ బేత్ మూనీ(43) ధనాధన్ ఆడడంతో ఆసీస్ ఖాతాలో భారీ విజయం చేరింది. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆరుసార్లు విజేత అయిన ఆస్ట్రేలియా 9వ సీజన్‌ను ఘనంగా మొదలెట్టింది. బ్యాటుతో, బంతితో అద్భుతంగా రాణించి శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ఇక ఈ ఓటమితో శ్రీలంక దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న న్యూజిలాండ్‌తో తలపడనుంది. నేడు జరిగే మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ బ్యాటింగ్ తీసుకుంది.