టెన్నిస్ ర్యాంకింగ్స్ లో జోకో అప్, నడాల్ డౌన్!

ప్రపంచ పురుషుల టెన్నిస్ నంబర్ వన్ ర్యాంక్ ను సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ తిరిగి కైవసం చేసుకొన్నాడు.

Advertisement
Update:2023-01-31 19:23 IST

టెన్నిస్ ర్యాంకింగ్స్ లో జోకో అప్, నడాల్ డౌన్!

ప్రపంచ పురుషుల టెన్నిస్ నంబర్ వన్ ర్యాంక్ ను సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ తిరిగి కైవసం చేసుకొన్నాడు. పదోసారి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా ఈ ఘనత సాధించాడు. స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ నాలుగుర్యాంకులు దిగువకు పడిపోయాడు.

మెల్బో్ర్న్ వేదికగా ముగిసిన ప్రస్తుత సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ ను రికార్డుస్థాయిలో పదోసారి గెలుచుకోడం ద్వారా సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ తిరిగి నంబర్ వన్ ర్యాంక్ అందుకొన్నాడు.

ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..ఇప్పటి వరకూ టాప్ ర్యాంకర్ గా ఉన్న స్పెయిన్ యువఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ రెండోర్యాంక్ కు పడిపోగా..జోకోవిచ్ తిరిగి టాపర్ ర్యాంకర్ గా నిలిచాడు.

374 వారాలుగా టాప్ రాంక్ లో జోకోవిచ్..

ప్రస్తుత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ప్రారంభానికి ముందు వరకూ 5వ ర్యాంక్ లో కొనసాగుతూ వచ్చిన జోకోవిచ్ పదోసారి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ విన్నర్ గా నిలవడంతో నాలుగుస్థానాల మేర ర్యాంక్ ను మెరుగుపరచుకొని మరోసారి అగ్రస్థానానికి చేరుకోగలిగాడు.

జోకోవిచ్ కెరియర్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా 374వారాలపాటు ఉండటం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తో 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన జోకోవిచ్ ..నడాల్ పేరుతో ఉన్న 22 టైటిల్స్ రికార్డును సమం చేయగలిగాడు.

6వ ర్యాంక్ లో స్పానిష్ బుల్..

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ రెండోరౌండ్లోనే కంగుతిన్న స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ప్రస్తుత రెండోర్యాంక్ నుంచి ఆరవ ర్యాంక్ కు పడిపోయాడు. కాగా..ప్రస్తుత టోర్నీ రన్నరప్, గ్రీకువీరుడు స్టెఫానోస్ సిటిస్ పాస్ మూడోర్యాంక్ అందుకొన్నాడు. ఇప్పటి వరకూ 3వ ర్యాంక్ లో ఉన్న నార్వే ఆటగాడు కాస్పెర్ రూడ్ 4వ ర్యాంక్ కు పడిపోయాడు.

రష్యా ఆటగాడు యాండ్రీ రుబ్ లేవ్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 5వ ర్యాంక్ సాధించాడు.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ లోనే ఓటమి పొందిన మరో రష్యన్ ఆటగాడు కరెన్ కచనోవ్ 7 స్థానాలు మెరుగు పరచుకొని 13వ ర్యాంక్ లో నిలిచాడు.

35 సంవత్సరాల జోకోవిచ్ ఏడాది విరామం తర్వాత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ను రికార్డుస్థాయిలో పదోసారి నెగ్గడం ద్వారా టాప్ ర్యాంక్, ట్రోఫీలతోపాటు 15 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకొన్నాడు.

Tags:    
Advertisement

Similar News