టెక్, ఇన్నోవేషన్ సమ్మిట్ కు కేటీఆర్ కు ఆహ్వానం
ఈనెల 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా సమ్మిట్
బెంగళూరులో ఈనెల 27, 28 తేదీల్లో ఎంట్రప్రెన్యూర్ ఇండియా నిర్వహించే టెక్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ -2025లో పాల్గొనాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించారు. సదస్సు ప్రారంభం రోజున కేటీఆర్ ''డ్రైవింగ్ డిజిటల్ ఇండియా : స్ట్రాటజీస్ ఫర్ టెక్నలాజికల్లీ అడ్వాన్డ్స్ ఫ్యూచర్'' అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారు. ''ది ఏఐ టెకేడ్'' థీమ్ నిర్వహిస్తున్న సమ్మిట్ లో బిజినెస్, టెక్నాలజీల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చూపించే ప్రభావంపై పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాల ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమ్మిట్‌లో 150 మందికి పైగా స్పీకర్లు ప్రసంగించడంతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆటోటెక్, స్పేస్ టెక్, హెల్త్ టెక్ లాంటి రంగాల్లో సెషన్లు నిర్వహించనున్నారు. గాలా ఐడియా అవార్డ్స్ ఈ సమ్మిట్‌లో ప్రత్యేక ఆవిష్కరణగా నిలవనుంది.