డీప్‌సీక్‌కు దక్షిణ కొరియాలో ఎదురుదెబ్బ
భద్రతా కారణాల రీత్యా యాపిల్ యాప్ స్టోర్,గూగుల్ ప్లే స్టోర్ ల నుంచి డీప్‌సిక్‌ను అక్కడ తొలిగింపు
చాట్‌జీపిని తలదన్నేలా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డౌన్‌లోడ్ సాధించిన చైనా ఏఐ అసిస్టెంట్ డిప్ సీక్ కు దక్షిణ కొరియాలో ఎదురుదెబ్బ తలిగింది. భద్రతా కారణాల రీత్యా యాపిల్ యాప్ స్టోర్,గూగుల్ ప్లే స్టోర్ ల నుంచి డీప్‌సిక్‌ను అక్కడ తొలిగించారు. దక్షిణ కొరియాతో సహా పలు దేశాలు దీప్‌సిక్‌పై ఆంక్షలు విధించాయి. థర్డ్ పార్టీ డేటాకు సంబంధించి డీప్‌సిక్ కంపెనీకి పారదర్శకత లేదని అధిక వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని పేర్కొన్నది. ఆన్‌లైన్ సమాచారాన్ని అతిగా పంచుకోవడం వల్ల సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని, దీనికి డీప్‌సిక్ దోహదం చేస్తుందని పేర్కొన్నది. డీప్ సిక్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డీప్‌సీక్‌తో వ్యక్తిగత సమాచారానికి ముప్పు పొంచి ఉన్నదని ఆదేశాలు భావిస్తున్నాయి. డీప్ సీక్ తిరిగి ప్రారంభించే ముందు వ్యక్తిగత గోప్యత, రక్షణను బలోపేతం చేయడానికి తమతో కలిసి పనిచేయడానికి చైనా అంగీకరించిందని వెల్లడించింది. ఇప్పటికే డీప్‌సీక్‌ను వ్యక్తిగత మొబైల్, కంప్యూటర్లలో డౌన్‌లోడో చేసుకున్న వారి ఎలాంటి ప్రభావం ఉండదని, వ్యక్తిగత రక్షణ సమాచార కమిషన్ స్పష్టం చేసింది.