Lava Yuva 5G | లావా ఇంట‌ర్నేష‌న‌ల్ నుంచి మ‌రో ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ లావా యువ 5జీ.. ఇవే స్పెషిఫికేష‌న్స్‌..!

Lava Yuva 5G | దేశీయ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ లావా ఇంట‌ర్నేష‌న‌ల్ (Lava International) త‌న లావా యువ 5జీ (Lava Yuva 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2024-05-31 13:30 IST

Lava Yuva 5G | దేశీయ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ లావా ఇంట‌ర్నేష‌న‌ల్ (Lava International) త‌న లావా యువ 5జీ (Lava Yuva 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ750 5జీ (octa-core Unisoc T750 5G) ప్రాసెస‌ర్‌తో వ‌స్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు లావా యువ 5జీ (Lava Yuva 5G) ఫోన్ హోల్‌పంచ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తోంది. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో ప‌ని చేస్తుంది.

లావా యువ 5జీ (Lava Yuva 5G) ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,499, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999 ప‌లుకుతుంది. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌, లావా ఈ - స్టోర్, రిటైల్ ఔట్‌లెట్ల‌లో ల‌భిస్తుంది. లావా యువ 5జీ ఫోన్‌పై ఏడాది పాటు వారంటీ క‌లిగి ఉంటుంది.

లావా యువ 5జీ (Lava Yuva 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 13 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. రెండేండ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌, ఆండ్రాయిడ్ 14 అప్‌గ్రేడ్ చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.52 అంగుళాల హెచ్‌డీ+ (720x1,600 పిక్సెల్స్‌) ఐపీఎస్ డిస్‌ప్లేతో వ‌స్తోంది. 2.5డీ క‌ర్వ్‌డ్ టాప్ సెంట‌ర్‌లో హెల్ పంచ్ క‌టౌట్ ఉంటుంది. అద‌న‌పు స్టోరేజీ కోసం ఆన్ బోర్డ్ మెమొరీ 8జీబీ వ‌ర‌కూ పెంచుకోవ‌చ్చు.

ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌, 2-మెగా పిక్సెల్ సెకండ‌రీ కెమెరాల‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్‌తోపాటు 8-మెగా పిక్సెల్ కెమెరా సెన్స‌ర్ ఉంటుంది.

మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో లావా యువ 5జీ (Lava Yuva 5G) ఫోన్ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ 128 జీబీ స్టోరేజీని మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వ‌ర‌కూ పెంచుకోవ‌చ్చు. 4జీ వోల్ట్‌, బ్లూటూత్ 5, జీపీఆర్ఎస్‌, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/ జీ / ఎన్‌ / ఏసీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. యాక్సెల‌రోమీట‌ర్‌, ఆంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, మ్యాగ్నెటో మీట‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్ ఉంటాయి. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌, ఫేస్ అన్‌లాక్ మ‌ద్ద‌తు క‌లిగి ఉంటుంది. లావా యువ 5జీ ఫోన్ 18వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది. సింగిల్ చార్జింగ్‌తో 28 గంట‌ల టాక్‌టైమ్ ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News