ITI SMAASH laptop | గ్లోబ‌ల్ బ్రాండ్ల‌కు పోటీగా.. ఐటీసీ `స్మాష్‌` లాప్‌టాప్‌లు.. మినీ పీసీలు..!

ITI SMAASH laptop | ఎల‌క్ట్రానిక్స్ రంగం నుంచి కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నీ త‌ప్పుకుంటున్న వేళ‌.. ఇండియ‌న్ టెలిఫోన్ ఇండ‌స్ట్రీస్ (ఐటీఐ)..గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జాల‌ను త‌ల‌ద‌న్నేలా.. మెరుగైన ప‌నితీరు, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో సొంత లాప్‌టాప్‌, మినీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2023-09-12 13:00 IST

ITI SMAASH laptop | గ్లోబ‌ల్ బ్రాండ్ల‌కు పోటీగా.. ఐటీసీ `స్మాష్‌` లాప్‌టాప్‌లు.. మినీ పీసీలు..!

ITI SMAASH laptop | ఎల‌క్ట్రానిక్స్ రంగం నుంచి కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నీ త‌ప్పుకుంటున్న వేళ‌.. ఇండియ‌న్ టెలిఫోన్ ఇండ‌స్ట్రీస్ (ఐటీఐ)..గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జాల‌ను త‌ల‌ద‌న్నేలా.. మెరుగైన ప‌నితీరు, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో సొంత లాప్‌టాప్‌, మినీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ ఆవిష్క‌రించింది. `స్మాష్ (SMAASH)` బ్రాండ్‌తో ఆవిష్క‌రించిన ఐటీసీ లాప్‌టాప్‌లు, ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు మార్కెట్‌లో రూ.32 వేల‌కే అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు ప్రపంచ ప్ర‌ఖ్యాతి గ‌ల సంస్థ‌లు లెనెవో, ఎసెర్‌, హెచ్‌పీ, డెల్ వంటి కంపెనీల‌తో పోటీ ప‌డుతూ లాప్‌టాప్‌లు, మినీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల స‌ర‌ఫ‌రాకు ప‌లు టెండర్ల‌ను సొంతం చేసుకున్న‌దీ కంపెనీ.

గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జాల‌ను త‌ల‌ద‌న్నేలా.. స‌క్సెస్‌ఫుల్‌`గా `స్మాష్‌` లాప్‌టాప్‌లు, మినీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లను డిజైన్ చేసి, బ‌హిరంగ మార్కెట్లోకి తీసుకెళ్లింద‌న్న వార్త వెలుగు చూడ‌టంతో సోమ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో ఐటీఐ షేర్ 52 వారాల గ‌రిష్ట స్థాయికి దూసుకెళ్లింది. ఒక్క రోజే రెండు కోట్ల షేర్లు చేతులు మారాయి. ఇండియ‌న్ టెలిఫోన్ ఇండ‌స్ట్రీస్ షేర్ 20 శాతానికి పైగా లాభ ప‌డింది. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో ఐటీఐ స్టాక్ 19.97 శాతం వృద్ధితో రూ.149.30ల‌తో అప్ప‌ర్ స‌ర్క్యూట్ వ‌ద్ద లాక్ అయింది.

మాన‌వాళి మ‌నుగ‌డ‌కు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతున్న ఈ-వ్య‌ర్థాల‌ను గ‌ణనీయంగా త‌గ్గించ‌డంలో గ్లోబ‌ల్ సంస్థ‌ల ఉత్ప‌త్తుల‌కు త‌మ మినీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ ఏమాత్రం తీసిపోదంటున్న‌ది ఐటీఐ.ఇత‌ర సంప్ర‌దాయ సంస్థ‌ల కంప్యూట‌ర్లతో పోలిస్తే వీటి వినియోగంలో విద్యుత్ ఆదా చేయొచ్చు. దీర్ఘ‌కాలం పాటు బ్యాట‌రీ లైఫ్ వీటి సొంతం. గ్లోబ‌ల్ బ్రాండ్ల‌తో పోటీ ప‌డుతూ మార్కెట్లోకి `స్మాష్` లాప్‌టాప్‌లు, మినీ కంప్యూట‌ర్ల‌ను మార్కెట్లోకి తీసుకెళ్లడంలో ఐటీఐ పాల‌క్క‌డ్ యూనిట్ అవిశ్రాంతంగా కృషి చేసిందంటున్నారు సంస్థ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రాజేశ్ రాయ్‌. బ‌హుళ జాతి సంస్థ‌ల‌తో పోటీ ప‌డుతూ టెండ‌ర్ల‌ను సొంతం చేసుకోవ‌డంతోపాటు మార్కెట్లోకి దూసుకెళ్ల‌డం స‌వాల్‌గా తీసుకుని ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపారు. టెక్నాల‌జీతో సృజ‌నాత్మ‌క ఆవిష్క‌ర‌ణ‌లు చేయ‌డంతోపాటు ప్ర‌తిసారీ స్మాష్ లాప్‌టాప్‌ల పంపిణీలోనూ ఇన్నోవేటివ్ బిజినెస్ మోడ‌ల్ అనుస‌రిస్తున్న‌ట్లు చెప్పారు.

పాఠ‌శాల విద్యార్థుల‌కు విద్యాబోధ‌న కోసం కేర‌ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చ‌ర్ అండ్‌ టెక్నాల‌జీ ఫ‌ర్ ఎడ్యుకేష‌న్ సంస్థ నుంచి రెండు టెండర్ల‌ను గెలుచుకున్న‌ది ఐటీఐ. ఇప్ప‌టికే కేర‌ళ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు సుమారు 9000 లాప్‌టాప్‌లు పంపిణీ చేసింది. వివిధ రంగాల క‌స్ట‌మ‌ర్ల‌కు 12 వేల‌కు పైగా స్మాష్ మినీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు విజ‌య‌వంతంగా స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది.

ఈ `స్మాష్‌` లాప్‌టాప్‌లు, మినీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల డిజైనింగ్‌, త‌యారీకి అవ‌స‌ర‌మైన టెక్నాల‌జీ కోసం `ఇంటెల్ కార్పొరేష‌న్ (Intel Corporation)`తో భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న‌ది. కేంద్ర క‌మ్యూనికేష‌న్ల మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలో ప‌ని చేస్తుందీ ఇండియ‌న్ టెలిఫోన్ ఇండ‌స్ట్రీస్ (ఐటీఐ). స్విచ్‌లు రూట‌ర్లు, నెట్‌వ‌ర్క్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌తోపాటు విస్తృత శ్రేణిలో టెలిక‌మ్యూనికేష‌న్ ప‌రిక‌రాల‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంతోపాటు త‌యారు చేయ‌డంలో త‌ల మున‌క‌లై ఉంది.

Tags:    
Advertisement

Similar News