స్మార్ట్‌ఫోన్ ఈ జనరేషన్‌ను పాడుచేస్తోందా?

పదేళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలకు గిఫ్ట్‌గా ఇచ్చిన మొబైల్ ఈ రోజు వారి జీవితాలను తమ నుంచి పూర్తిగా లాగేసుకుందని తెలుసుకుని వాపొతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లతో పెరిగిన పిల్లలు ఒత్తిడి లేని సాధారణ జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్నారని రోజుకో స్టడీ చెప్తోంది.

Advertisement
Update:2024-05-12 06:00 IST

కొన్నేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన మొబైల్ మన రోజువారీ పనులను ఈజీ చేస్తుందని అందరూ ఊహించారు. అలాగే వృత్తి, వ్యాపార విషయాల్లో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తుందని సంబరపడ్డారు. కానీ, అదే మొబైల్ పిల్లల జీవితాలను విపరీతంగా ప్రభావితం చేస్తుందని ఊహించలేకపోయారు. ఇప్పుడీ సమస్య ఒక జనరేషన్‌ను పూర్తిగా దెబ్బతీసేస్తోంది. మరి దీనికి పరిష్కారాలేంటి?

పదేళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలకు గిఫ్ట్‌గా ఇచ్చిన మొబైల్ ఈ రోజు వారి జీవితాలను తమ నుంచి పూర్తిగా లాగేసుకుందని తెలుసుకుని వాపొతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లతో పెరిగిన పిల్లలు ఒత్తిడి లేని సాధారణ జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్నారని రోజుకో స్టడీ చెప్తోంది.

రిస్క్‌లు ఇవే..

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చిన మొదట్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, ఆ తర్వాత మొదలైన ఇంటర్నెట్ విప్లవం, సోషల్ మీడియా, గేమింగ్, కెమెరా కల్చర్.. ఇలా క్రమంగా మొబైల్ అడిక్షన్ అనేది దశలవారీగా అభివృద్ధి చెందుతూ పోయింది. దీనివల్ల ఇప్పటివరకూ లేని కొత్త ధోరణులు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాల్లో ట్రోలింగ్‌కు గురవ్వడం, గేమ్స్‌కు బానిసలవ్వడం, సులభంగా యాక్సెస్ చేయగల అశ్లీలత.. ఇలాంటివాటి వల్ల యువతలో మెంటల్ డిప్రెషన్, యాంగ్జయిటీ పెరుగుతున్నాయి. చదువుని నెగ్లెక్ట్ చేయడం, సెల్ఫీల మోజులో ప్రాణాలు కోల్పోవడం, మొబైల్ వదిలి ఉండలేకపోవడం, రిలేషన్స్ దెబ్బతినడం.. ఇలా ఇప్పటి యువత, టీనేజర్స్‌ను దెబ్బతీస్తున్న అంశాలు అన్నీ ఇన్నీ కావు.

ముఖ్యంగా ఇప్పటి టీనేజర్లు గత జనరేషన్ వాళ్లతో పోల్చితే చాలా తక్కువ ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ కలిగి ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం మొబైల్ అడిక్షన్ ఒక్కటే అని స్టడీలు బల్లగుద్ది చెప్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్ వల్ల రోజులో గంటల కొద్దీ సమయం వృథా అవుతోంది. శారీరకంగా తగినంత విశ్రాంతి ఉండట్లేదు. నిద్రను అవాయిడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అటెన్షన్ సాధించడమే సక్సెస్‌గా భావిస్తున్నారు. దానికోసం రకరకాల కొత్త పోకడలకు పోతున్నారు. మొబైల్ విషయంలో కాస్త స్ట్రిక్ట్‌గా ఉన్న పేరెంట్స్‌ను విలన్స్‌గా చూసే ధోరణి పెరుగుతోంది. అలా ఫ్యామిలీ రిలేషన్స్‌కు దూరమవుతున్నారు. ఇలా మొబైల్ వల్ల ఇప్పటి జనరేషన్ పూర్తిగా దారి తప్పుతోంది.

పరిష్కారాలివే..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కానీ, ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టాలి. పిల్లలను భ్రమలకు దూరంగా మనషులకు దగ్గరగా చేయాలంటే ప్రభుత్వాలు, పేరెంట్స్ కలిసి కొన్ని నిర్ణయాలకు రావాలి.

ముందుగా హైస్కూల్ చదివే పిల్లలకు స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచకుండా జాగ్రత్తపడాలి. స్కూల్స్‌లో మొబైల్ వాడకంపై తగిన చర్యలు చేపట్టాలి.

16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు మొబైల్ వాడకుండా పేరేంట్స్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లలను వాస్తవ ప్రపంచంలో పెరిగేలా ప్రయత్నాలు చేపట్టాలి. మొబైల్‌పై నుంచి వాళ్ల అటెన్షన్‌ను దారి మళ్లించి ఆటలు, ఆర్ట్స్ వంటి వాటి వైపు మరల్చాలి. దానికి తగిన ఏర్పాట్లు, ప్రణాళికలపై ప్రభుత్వాలు పనిచేయాలి.

Tags:    
Advertisement

Similar News