యాపిల్ కొత్త ‘ఎం3’ చిప్.. స్పెషల్ ఫీచర్లివే..

మొన్న జరిగిన యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈ వెంట్‌లో యాపిల్ సంస్థ తన లేటెస్ట్ ‘ఎం3’ సిరీస్ ప్రాసెసర్లను లాంఛ్ చేసింది. గత ప్రాసెసర్లతో పోలిస్తే ఈ ప్రాసెసర్ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండనుంది.

Advertisement
Update:2023-11-01 16:53 IST

యాపిల్ కొత్త ‘ఎం3’ చిప్.. స్పెషల్ ఫీచర్లివే..

మొన్న జరిగిన యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈ వెంట్‌లో యాపిల్ సంస్థ తన లేటెస్ట్ ‘ఎం3’ సిరీస్ ప్రాసెసర్లను లాంఛ్ చేసింది. గత ప్రాసెసర్లతో పోలిస్తే ఈ ప్రాసెసర్ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండనుంది. ఇందులోని స్పెషల్ ఫీచర్లేంటంటే..

యాపిల్ నుంచి కొత్త ‘ఎం3’ సిరీస్‌ ప్రాసెసర్లు, మ్యాక్‌బుక్‌ ప్రో, ఐ మ్యాక్ వంటి లేటెస్ట్ ప్రొడక్ట్స్ లాంఛ్ అయ్యాయి. సరికొత్త ఎం3 చిప్‌సెట్‌.. యాపిల్ మ్యాక్ ప్రాసెసర్ లైనప్‌లో మూడో జనరేషన్ ప్రాసెసర్.

ఈ అడ్వాన్స్‌డ్ చిప్‌సెట్‌తో యాపిల్ డివైజ్‌ల పనితీరు 30 శాతం ఇంప్రూవ్ అవుతుంది. ఇది అడ్వాన్స్‌డ్ ‘3 నానోమీటర్ ఆర్కిటెక్చర్’ టెక్నాలజీపై తయారైంది. ఈ చిప్.. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్‌ను మరింత సమర్థవంతంగా మేనేజ్ చేయగలదు. అంటే గేమ్స్, వీడియో ఎడిటింగ్, త్రీడీ డిజైన్ వంటివి మరింత సులభతరం కానున్నాయి. ఈ చిప్‌లో గ్రాఫిక్స్ కోసం అదనంగా పది కోర్స్‌ను అమర్చారు. దానివల్ల తక్కువ బ్యాటరీని వాడుకుంటూ మరింత మెరుగైన పర్ఫామెన్స్‌ను అందించగలుగుతుంది. అంతేకాకుండా ఇందులో డైనమిక్‌ మెమొరీ క్యాచింగ్‌, అలకేషన్‌ సిస్టమ్‌, మెష్‌ షేడింగ్‌, రే ట్రేసింగ్‌ వంటి కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి.

యాపిల్ చెప్పినదాని ప్రకారం.. ఎం3, ఎం3 ప్రో, ఎం3 మాక్స్ చిప్‌లు అప్‌గ్రేడెడ్ న్యూరల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. మొదటి జనరేషన్ ‘ఎం1’ చిప్ తో పోలిస్తే.. 60 శాతం ఎక్కువ వేగంగా పనిచేయగలవు. ‘ఎం2’ చిప్ తో పోలిస్తే 1.8 రెట్లు ఎక్కువ పర్ఫామెన్స్ అందిచగలవు. ఎం2 చిప్ తో పోలిస్తే.. ఇందులోని పర్ఫార్మెన్స్‌ కోర్స్‌ 15 శాతం, ఎఫీషియెన్సీ కోర్స్‌ 30 శాతం వేగంగా పనిచేస్తాయి. ఈ లేటెస్ట్ చిప్ సిరీస్ ద్వారా మ్యాక్ ప్రొడక్ట్స్.. గరిష్టంగా 22 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలవని యాపిల్ పేర్కొంది.

ఇక వీటితోపాటు 14 ఇంచ్, 16 ఇంచ్‌ల కొత్త మ్యాక్‌బుక్‌ ప్రోను కూడా యాపిల్ లాంఛ్ చేసింది. ఇవి కొత్త ఎం3 ప్రాసెసర్ల వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఎం3 మ్యాక్స్‌ చిప్‌తో వచ్చే మ్యాక్‌బుక్‌ ప్రో 128జీబీ ర్యామ్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది.

మ్యాక్‌బుక్‌ ధరలు.. స్టోరేజీ, స్క్రీన్ సైజను బట్టి రూ.1,69,900 నుంచి రూ.3,99,900 వరకూ అందుబాటులో ఉన్నాయి. 24 అంగుళాల ఐమ్యాక్‌ డెస్క్‌టాప్ ధరలు రూ. 1,34,900 నుంచి మొదలవుతాయి. ఇందులో 4.5కే రిజల్యూషన్‌ స్క్రీన్‌తో పాటు ఎం3 చిప్, 108 ఎంపీ కెమెరా, స్పీకర్స్, మైక్‌, యూఎస్‌బీ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News