త్వరలో విజయ్ - రష్మికల‌ నిశ్చితార్థం.. క్లారిటీ ఇదే..!

విజయ్ - రష్మిక మొదటిసారి గీత గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వెంటనే వారిద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమా కోసం పనిచేశారు.

Advertisement
Update:2024-01-08 20:05 IST

రెండ్రోజులుగా ఎక్కడ చూసినా ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన‌ పెళ్లి వార్తలే హల్‌చ‌ల్‌ చేస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకోనుందని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా సంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమేనని వారిద్దరి అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఈ వార్తలపై తాజాగా విజయ్ టీమ్ స్పష్టత ఇచ్చింది. విజయ్ దేవరకొండ- రష్మిక ఎంగేజ్‌మెంట్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరింది. విజయ్ టీమ్ ఇచ్చిన క్లారిటీతో విజయ్ - రష్మిక ఎంగేజ్‌మెంట్‌పై వస్తున్న వార్తలన్నీ అవాస్త‌వ‌మ‌ని తేలిపోయింది.

విజయ్ - రష్మిక మొదటిసారి గీత గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వెంటనే వారిద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమా కోసం పనిచేశారు. వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటించడం, ఇద్దరు కలిసి బయట కనిపించడం, రష్మిక కూడా ఓసారి విజయ్ ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం మొదలైంది.

వారిద్దరూ కలిసిన ప్రతిసారి ఇటువంటి వార్తలే వస్తుండటంతో పలుమార్లు తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని విజయ్ -రష్మిక వెల్లడించారు. తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నానని, విజయ్ తాను మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని రష్మిక ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. రష్మిక తన ఫ్రెండ్ అని, సోషల్ మీడియాలో ప్రతిసారి చెత్త వార్తలు చూడాల్సి వస్తోందని విజయ్ కూడా ఓ సారి అసహనం వ్యక్తం చేశాడు.

Tags:    
Advertisement

Similar News