ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ ఎలా అప్ల‌య్‌ చేయాలంటే..

గత కొన్నేళ్లుగా మనదేశంలో పాస్‌పోర్ట్ తీసుకుంటున్న వాళ్ల సంఖ్య ఎక్కువైంది. దాంతో పాస్ పోర్ట్ సేవలకు డిమాండ్ పెరిగింది. అందుకే ఆన్‌లైన్‌లో పాస్ పోర్ట్ సేవల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది.

Advertisement
Update:2022-10-14 15:24 IST

కోవిడ్ భయం తగ్గిన తర్వాత చాలామంది విదేశాలకు టూర్ వెళ్లాలనుకుంటున్నారు. అయితే ఫారెన్ టూర్ వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాలి. దాన్ని ఈజీగా ఆన్‌లైన్‌లో ఎలా అప్ల‌య్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గత కొన్నేళ్లుగా మనదేశంలో పాస్‌పోర్ట్ తీసుకుంటున్న వాళ్ల సంఖ్య ఎక్కువైంది. దాంతో పాస్ పోర్ట్ సేవలకు డిమాండ్ పెరిగింది. అందుకే ఆన్‌లైన్‌లో పాస్ పోర్ట్ సేవల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది. దీనిద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా పాస్‌పోర్ట్ అప్ల‌య్‌ చేసుకోవచ్చు.

  • ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్ల‌య్‌ చేయడం కోసం ముందుగా పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్ 'passportindia.gov.in' వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత హోమ్ స్క్రీన్‌పై 'రిజిస్టర్ నౌ' లింక్‌పై క్లిక్ చేయాలి. పూర్తి వివరాలు ఎంటర్ చేసి, లాగిన్ డీటెయిల్స్ పొందాలి.
  • ఇప్పుడు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీతో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
  • తర్వాత పాస్‌పోర్ట్‌ కోసం అప్లికేషన్ పెట్టేందుకు 'అప్ల‌య్‌' బటన్ పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత అన్ని వివరాలు ఎంటర్ చేసి 'సబ్మిట్' బటన్ నొక్కాలి.
  • ఇప్పుడు పాస్ పోర్ట్ సర్వీస్ ఛార్జీలు చెల్లించేందుకు 'పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • నెట్ బ్యాంకింగ్ లేదా కార్డు ద్వారా పేమెంట్ చేసి 'ప్రింట్ అప్లికేషన్ రిసీట్' లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇదంతా పూర్తయిన తర్వాత మొబైల్ కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. దీంతో ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  • ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి పాస్ పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లాలి. అడ్రస్, ఇతర వివరాలు చెక్ చేసిన తర్వాత పాస్‌పోర్ట్.. పోస్ట్‌లో ఇంటికొస్తుంది.
Tags:    
Advertisement

Similar News