వరల్డ్ రికార్డ్.. గేల్‌ను దాటేసిన హిట్ మ్యాన్

రోహిత్ శర్మ మరో 5 సిక్సర్లు బాదితే వన్డేల్లో 300 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇప్పటికే ఈ జాబితాలో గేల్, అఫ్రిది ఉన్నారు.

Advertisement
Update:2023-10-11 22:28 IST

భారత క్రికెట్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (554) బాదిన ఆటగాడిగా నిలిచి వరల్డ్ రికార్డు సాధించాడు. ప్రపంచ కప్‌లో భాగంగా బుధ‌వారం ఆఫ్ఘనిస్తాన్ - టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మూడో సిక్స్ కొట్టడం ద్వారా రోహిత్ శర్మ ఈ రికార్డు సాధించాడు. తద్వారా ప్రపంచంలో అత్యధిక సిక్సులు కొట్టిన వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్‌ను రోహిత్ అధిగమించాడు.

గేల్ 483 మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు సాధించగా.. రోహిత్ 473 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనతను చేరుకున్నాడు. మొత్తంగా రోహిత్ శర్మ టెస్టుల్లో 77, వన్డేల్లో 295, టీ -20ల్లో 182 సిక్సర్లు బాదాడు. ఇక అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది(476) మూడో స్థానంలో, న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్(398) నాలుగో స్థానంలో నిలువగా, అదే దేశానికి చెందిన మార్టిన్ గప్టిల్(383) అయిదో స్థానంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ మరో 5 సిక్సర్లు బాదితే వన్డేల్లో 300 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇప్పటికే ఈ జాబితాలో గేల్, అఫ్రిది ఉన్నారు. 2007లో రోహిత్ శర్మ టీమిండియాలో మొదటిసారిగా స్థానం సంపాదించాడు. టెస్టుల్లో 3,500కు పైగా పరుగులు చేసిన రోహిత్.. వన్డేలలో ఏకంగా 10 వేలకు పైగా పరుగులు సాధించి దిగ్గజాల సరసన చోటు సంపాదించుకున్నాడు.


Tags:    
Advertisement

Similar News