విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పవన్ విషెస్
సోషల్ మీడియా వైరల్‌గా మారిన ఈ పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై టాలీవుడ్ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయనకు విషెస్ చెబుతూ.. తాజగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కి నా హృదయపూర్వక అభినందనలు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెటీజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నది.
కెరీర్ పీక్‌లో ఉండగా వదిలేసి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని నిన్న విజయ్ ప్రకటించారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి మహానాడులో పార్టీ అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు.
విజయ్ తమ పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రకటించారు. 'ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్ల లాంటివి అన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. వాటి ఆధారంగానే పనిచేస్తాం. పెరియార్ ఈవీ రామస్వామి, కె. కామరాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్, సక్సెస్ స్టోరీలు చదివాక... నేను నా కెరీర్ పీక్‌లో వదిలేసి మీ అందరిపై అంచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడినా. రాజకీయ అనుభవం లేదంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అమితమైన ఆత్మ విశ్వాసంతో మనం సర్పం (రాజకీయం)తో ఆడుకునే పిల్లలాంటివాళ్లం' అన్నారు.