స్వలింగ వివాహాలకు కేంద్రం వ్యతిరేకం.. సుప్రీంలో అఫిడవిట్

సుప్రీంకోర్టులో స్వలింగ వివాహాలకు గుర్తింపు కోరుతూ ఇటీవల పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఈనెల 13నుంచి విచారణ మొదలవుతుంది. ఈలోగా కేంద్రం వైఖరిని కోరింది సుప్రీం.

Advertisement
Update:2023-03-12 17:37 IST

స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది కేంద్రం. ఈమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థలో పురుషులు పురుషులతో, మహిళలు మహిళలతో కలిసి జీవించడం, లైంగిక సంబంధం కలిగి ఉండడాన్ని కుటుంబంగా చెప్పలేమని స్పష్టం చేసింది కేంద్రం.

సుప్రీంకోర్టులో స్వలింగ వివాహాలకు గుర్తింపు కోరుతూ ఇటీవల పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఈనెల 13నుంచి విచారణ మొదలవుతుంది. ఈలోగా కేంద్రం వైఖరిని కోరింది సుప్రీం. విచారణ మొదలయ్యే సందర్భంలో కేంద్రం క్లారిటీ చ్చింది. స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భారతదేశ సంస్కృతికి, జీవన విధానానికి స్వలింగ వివాహాలు విరుద్ధమని కేంద్రం కోర్టుకు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించి చట్టాలు చేయడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. 1954 స్పెషల్ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం కూడా స్వలింగ వివాహాలకు గుర్తింపునివ్వడం కుదరదని తేల్చి చెప్పింది కేంద్రం.

ఇటీవల దేశంలో చాలా చోట్ల స్వలింగ వివాహాలు జరిగిన సంగతి తెలిసిందే. విదేశాల్లో స్వలింగ వివాహాలు చేసుకున్న వారు కూడా ఇక్కడకు తిరిగొచ్చిన తర్వాత తమకు మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటున్నారు. తమ వివాహాలను గుర్తించాలంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి వివాహాలు ఎక్కడా రిజిస్టర్ కాలేదు, వాటికి గుర్తింపు లేదు. అలాంటి వారిని దంపతులుగా ప్రభుత్వం గుర్చించదు, దంపతులుగా వారికి ఎలాంటి అనుమతులు లేవు. వీటికోసమే ఎల్జీబీటి కమ్యూనిటీ ఆందోళన బాట పట్టింది. స్వలింగ వివాహాలు చేసుకున్నవారితోపాటు ఎల్జీబీటీ ప్రతినిధులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం అఫిడవిట్ వారికి అశనిపాతంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై రేపటినుంచి విచారణ చేపడుతుంది. కేంద్రం అఫిడవిట్ ఈ విచారణలో కీలకం కాబోతోంది.

Tags:    
Advertisement

Similar News