ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. సస్పెన్స్ కంటిన్యూస్..!
ఇవాళ ఓల్డ్ పార్లమెంట్‌లో గంటకుపైగా సుదీర్ఘ ప్రసంగం చేశారు ప్రధాని మోడీ. పాత బిల్డింగ్‌లో ఇదే ఆయనకు చివరి ప్రసంగం. 75 ఏళ్ల భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏం చర్చించారనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇవాళ ఎలాంటి ప్రకటన రాలేదు. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయోద్దని మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.
ఇక ఈ పార్లమెంట్ స్పెషల్ సెషన్‌పై మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సెషన్‌కు సంబంధించి ఎజెండాను ఇప్పటివరకూ బహిర్గతం చేయలేదు కేంద్ర ప్రభుత్వం. దీంతో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ బిల్లు, యూనిఫామ్ సివిల్ కోడ్, వన్ ఇండియా-వన్ నేషన్ లాంటి కీలక బిల్లులు ప్రవేశపెడతారంటూ చర్చ జరుగుతోంది. అయితే సమావేశాల్లో ఏ బిల్లులు ప్రవేశపెడతారనేది ఇప్పటివరకూ క్లారిటీ లేదు.
పార్లమెంట్ ఐదు రోజుల ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 22న ముగియనున్నాయి. ఇవాళ ఓల్డ్ పార్లమెంట్‌లో గంటకుపైగా సుదీర్ఘ ప్రసంగం చేశారు ప్రధాని మోడీ. పాత బిల్డింగ్‌లో ఇదే ఆయనకు చివరి ప్రసంగం. 75 ఏళ్ల భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్‌లో సభా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటివరకూ స్పెషల్ సెషన్స్‌కు సంబంధించి ఎజెండా బయటపెట్టకపోవడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి.