డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌ ప్రమోట్‌

సినిమా నుంచి అనతికాలంలోనే డిప్యూటీ సీఎంగా ఎదిగిన యువనేత

Advertisement
Update:2024-09-29 20:18 IST

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమోట్‌ అయ్యారు. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మనీలాండరింగ్‌ కేసులో జైలుకు వెళ్లి, రెండు రోజుల కిందట బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ కూడా మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.

గోవి చెళియన్‌, ఎస్‌ఎం నాజర్‌, ఆర్‌ రాజేంద్రన్‌లు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సెంథిల్‌కు విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ, చెళియన్‌కు విద్యా శాఖ, నాజర్‌కు మైనారిటీ వ్యవహారాలు, రాజేంద్రన్‌కు పర్యాటక శాఖలు కేటాయించారు. మంత్రి పునర్‌ వ్యవస్థీకరణ సాధారణ జరిగే ప్రక్రియే అయినప్పటికీ ఈసారి ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించడంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.

గోవి చెళియన్‌, ఎస్‌ఎం నాజర్‌, ఆర్‌.రాజేంద్రన్‌లు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సెంథిల్‌కు విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ, చెళియన్‌కు విద్యాశాఖ, నాజర్‌కు మైనార్టీ వ్యవహారాలు, రాజేంద్రన్‌కు పర్యటక శాఖలను కేటాయించారు. పునర్‌వ్యవస్థీకరణ సాధారణమైనదే అయినప్పటికీ.. ఈసారి ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఉదయనిధి ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మళ్లీ ప్రమాణం చేయలేదు. ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లే ముందు మీడియా మాట్లాడిన ఆయన డిప్యూటీ సీఎం అనేది తనకు పదవి కాదని, ఓ పెద్ద బాధ్యత అన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు

ఉదయనిధిని అన్నాడీఎంకే యువరాజుగా అభివర్ణించింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే పతనానికి ఇదో సూచిక అన్నది. తమ కుటుంబం నుంచి ఎవరూ పార్టీలోకి రారని 2021 ఎన్నికలకు ముందు స్టాలిన్‌ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబపాలన సాగుతున్నదని, రాష్ట్రానికి ఇదో చీకటి రోజు అని విమర్శించింది. కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రజలను డీఎంకే మోసం చేస్తున్నదని బీజేపీ విమర్శలు గుప్పించింది.

Tags:    
Advertisement

Similar News