మణిపూర్‌లో మరో దారుణం.. ఇద్దరు స్టూడెంట్స్ హత్య, ఫొటోలు వైరల్
తాజాగా ఈ ఇద్దరు స్టూడెంట్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది.
మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జూలైలో తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఫొటోల ఆధారంగా వీరిద్దరు మెయితీ తెగకు చెందిన హిజామ్ లిన్‌తో ఇంగంబి, ఫిజామ్ హేమ్‌జిత్‌గా గుర్తించారు. మొదటి ఫొటోలో హిజామ్ వైట్ టీ-షర్ట్ వేసుకుని ఉంది. హేమ్‌జిత్ చెక్స్ షర్ట్ వేసుకుని బ్యాగు ధరించి ఉన్నాడు. వారిద్దరి వెనుక ఇద్దరు గన్స్ పట్టుకుని నిలబడడం ఫొటోలో కనిపిస్తుంది. ఫొటోలు పరిశీలించిన అధికారులు.. అది తిరుగుబాటు దళాల శిబిరంగా అనుమానిస్తున్నారు. ఇద్దరిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఇక రెండో ఫొటోలో ఇద్దరు విగత జీవులుగా పడి ఉండటం కనిపించింది. ఫొటోలు వైరల్ అయితున్నప్పటికీ.. ఇంకా డెడ్‌బాడీలు ఎక్కడున్నాయనేది గుర్తించలేదు. జూలైలో చివరిసారిగా ఓ షాపులో అమర్చిన సీసీ టీవీలో ఈ ఇద్దరు స్టూడెంట్స్ కనిపించినా.. వారి ఆచూకీ కనుక్కొవడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. తాజాగా ఈ ఇద్దరు స్టూడెంట్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది. జూలైలో ఇద్దరు తప్పిపోతే ఇప్పటివరకూ పోలీసులు కేసు ఛేదించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ అంశంపై ప్రభుత్వం స్పందించింది. ఇద్దరు స్టూడెంట్స్ అంశం తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించామని అధికారులు చెప్తున్నారు. ఈ ఇద్దరిని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
గతంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపింది. మణిపూర్‌లో ఇలాంటి అనేక దారుణాలు వెలుగులోకి రాలేదని స్వయంగా ముఖ్యమంత్రే గతంలో ప్రకటించారు. ఇక మణిపూర్‌లో మే 3న మొదలైన హింసలో ఇప్పటివరకూ 180కి పైగా చనిపోయారు. వేలాది మంది రాష్ట్రాన్ని వదిలివెళ్లారు.