కేజ్రీవాల్, పర్వేశ్ మధ్య విజయం దోబూచులాట
రౌండ్ రౌండ్ ఉత్కంఠగా మారుతున్న న్యూ ఢిల్లీ స్థానం
Advertisement
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఒక్క ఫలితం కూడా వెలువడనప్పటికీ.. న్యూ ఢిల్లీ స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. ఆప్ అభ్యర్థి కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేశ్ మధ్య విజయం దోబూచులాట ఆడుతున్నది. మొదటి ఆధిక్యం ప్రదర్శించిన కేజ్రీవాల్.. ఏడు రౌండ్లు ముగిసే సమయానికి 238 ఓట్లు వెనుకంజలోకి వచ్చారు. కాల్‌కాజీ స్థానంలో సీఎం ఆతిశీ 2,800 ఓట్లు, షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ 8,7,49 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
Advertisement