ముహూర్తం ఖరారు.. ఇంతకీ సీఎం ఎవరు?

18న రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం

Advertisement
Update:2025-02-16 10:33 IST

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రితో పాటు కేబినెట్‌ మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 18న (మంగళవారం) ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ముహూర్తం ఖరారు అయినా ఢిల్లీ సీఎం పగ్గాలు ఎవరు చేతిలో పెట్టబోతున్నారనే దానిపై బీజేపీ అధినాయకత్వం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ శాసనసభాపక్షం సమావేశం అయి కొత్త సభానాయకుడిని ఎన్నుకోనుంది. సీఎం రేస్‌లో మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడు పర్వేశ్‌ వర్మ ముందున్నారు. కేజ్రీవాల్‌ పై విజయం సాధించడంతో పాటు పార్టీ హైకమాండ్‌ మద్దతు ఆయనకే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అశీశ్ సూద్‌, రేఖా గుప్తా పేర్లు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 27 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈక్రమంలోనే సీఎం ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది.

Tags:    
Advertisement

Similar News