జార్ఖండ్‌లో ముగిసిన తొలి దశ పోలింగ్
జార్ఖండ్‌లో మధ్యాహ్నం మూడు గంట నాటికి 59.28 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఈసీ తెలిపింది
జార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్ సమయం ముగిసింది. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశలో 43 స్థానాల్లో పొలింగ్ జరిగింది. 950 కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే సమయం ముగిసింది. మధ్యాహ్నం మూడు గంట నాటికి 59.28 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఈసీ తెలిపింది. రెండవ దశ పోలింగ్ 38 నియోజకవర్గాల్లో ఈ నెల 20న జరగనున్నది. ఓట్లను 23న లెక్కిస్తారు. హేమంత్ సోరెన్ ఝార్ఖండ్‌కు ప్రస్తుత ముఖ్యమంత్రి. రాష్ట్ర శాసనసభ గడువు 2025 జనవరి 5న ముగియనున్నది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు వేలాది మంది ఎన్నికల అధికారులు, భద్రత సిబ్బందిని మోహరించారు. పోలింగ్ బృందాలను నిర్దేశిత ప్రదేశాలకు పంపా రు. 225 సున్నిత పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ కేంద్రాలు ఐదు జిల్లాలు పశ్చిమ సింగ్‌భుమ్, లాతెహార్, లోహరదాగా, గఢ్వా, గుమ్లా జిల్లాల్లో ఉన్నాయి.