పార్సిల్ ఇచ్చి షూ పట్టుకుపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన ఓ నిర్వాకం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పార్సిల్ ఇవ్వటానికి వచ్చి ఇంటి ముందు నుంచి షూలను దొంగిలించిన ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన ఓ నిర్వాకం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పార్సిల్ ఇవ్వటానికి వచ్చి ఇంటి ముందు నుంచి షూలను దొంగిలించిన ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం స్విగ్గీ యాజమాన్యానికి చేరడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
వీడియోలో ఏముందంటే..
ఒక అపార్ట్‌మెంట్లో ఫుడ్ డెలివారీకి వచ్చాడు ఒక డెలివరీ బాయ్. ఇంటి గుమ్మం ముందు నిలుచుని బెల్ కొట్టాడు. కస్టమర్ లోపలి నుంచి వచ్చేటప్పటికీ కొంత ఆలస్యం కావడంతో డోర్ ముందు ఉన్న షూలపై అతని కన్ను పడింది. ఇంటి ముందు మూడు జతల షూలు ఉన్నాయి. ఇంతలో కస్టమర్ వచ్చి ఫుడ్ తీసుకుని డోర్ వేసేసింది. కొన్ని మెట్లు కిందకు దిగి, కింద నుంచి ఎవరైనా పైకి వస్తున్నారేమోనని చెక్ చేసుకున్నాడు. మళ్లీ వెనక్కి తిరిగొచ్చాడు. నచ్చిన ఒక జత షూను టవల్‌లో చుట్టుకుని వెళ్లిపోయాడు.
అయితే బూట్లు దొంగిలించిన వ్యక్తి పై కస్టమర్ స్విగ్గీ సంస్థకు ఫిర్యాదు చేస్తే కంపెనీ మొదట ఏమాత్రం స్పందించ లేదు. అయితే ఈ ఘటన తాలూకు సిసి టీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను అత్యధిక సంఖ్యలో నెటిజన్లు వీక్షించారు. దాంతో విషయంపై స్విగ్గీ స్పందించింది. 'డెలివరీ పార్ట్‌నర్ల నుంచి తాము సరైన పని తో పాటూ మంచి తనాన్ని కూడా ఆశిస్తున్నామని' ప్రకటించింది.
ఈ సంఘటన హమ్మయ్య ఆర్డర్ ఇచ్చేశాం.. ఫుడ్ వచ్చేసింది అని రిలాక్స్ అయిపోవటం కాకుండా ఇంటి బయట కూడా అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరాన్ని కలిగించింది.