రాహుల్ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన‌ సుప్రీంకోర్టు

గుజ‌రాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ స్టే పిటిష‌న్ వేయ‌గా, దానిని ఇటీవ‌ల ఆ కోర్టు కొట్టేసింది. దీంతో ఈ తీర్పును స‌వాల్ చేస్తూ ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

Advertisement
Update:2023-07-18 12:15 IST

ప‌రువు న‌ష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వేసిన పిటిష‌న్‌ను విచార‌ణకు స్వీక‌రించేందుకు సుప్రీంకోర్టు అంగీక‌రించింది. జూలై 21న దీనిపై విచార‌ణ చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించింది. `ప్ర‌ధాని మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సెష‌న్స్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష‌ విధించిన విష‌యం తెలిసిందే. దీనిపై గుజ‌రాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ స్టే పిటిష‌న్ వేయ‌గా, దానిని ఇటీవ‌ల ఆ కోర్టు కొట్టేసింది. దీంతో ఈ తీర్పును స‌వాల్ చేస్తూ ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌గా, దీనిపై ప‌రువు న‌ష్టం కేసు న‌మోదైంది. ఈ కేసులో ఆయ‌న‌కు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో న్యాయ‌స్థానం తీర్పు చెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ.. లోక్‌స‌భ స‌చివాల‌యం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఆయ‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్ద‌యిన విష‌యం తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News