నక్సల్స్‌లేని భారత్‌ దిశగా ఇది ఓ కీలక అడుగు

ఛత్తీస్‌గఢ్‌-ఒడిషా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌ షా స్పందన

Advertisement
Update:2025-01-21 13:29 IST

ఛత్తీస్‌గఢ్‌-ఒడిషా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఇప్పటికీ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది నక్సల్‌ లేని భారత్‌ దిశగా కీలక అడుగని వ్యాఖ్యానించారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉన్నదన్నారు.

ఇది నక్సలిజానికి గట్టి ఎదురుబెబ్బ. మన భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయం. నక్సల్స్‌లేని భారత్‌ దిశగా ఇది ఓ కీలక అడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉన్నది. సీఆర్‌పీఎఫ్‌, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బలగాలు ఈ జాయింట్‌ ఆపరేషన్‌లో భాగమయ్యాయి అని అమిత్‌ షా పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌-ఒడిషా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్‌, నౌపాడాలో జనవరి 19 రాత్రి నుంచి ఈ ప్రత్యేక ఆపరేషన్‌ జరగుతున్నది. పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News