హెల్త్‌ ఇన్సూరెన్స్‌ డేటా అమ్మకానికి!?

టెలీగ్రామ్‌ లో సేల్ కు.. ఆందోళనలో స్టార్‌ హెల్త్‌ కస్టమర్లు

Advertisement
Update:2024-09-21 02:07 IST

ప్రముఖ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 'స్టార్‌ హెల్త్‌' పాలసీ హోల్డర్ల పర్సనల్‌ డేటా అమ్మకానికి పెట్టారనే ప్రచారం భారతదేశంలోని లక్షలాది మందిని ఆందోళనకు గురి చేస్తోంది. టెలిగ్రామ్‌ లోని చాట్‌ బాట్స్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ పాలసీదారులతో పాటు వారికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టులు కూడా సేల్‌ కు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటికి పొక్కడంతో స్టార్‌ హెల్త్‌ లో ఇన్సూరెన్స్ చేయించుకున్న వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. వినియోగదారుల డేటా అమ్మకానికి పెట్టిన ఘటనపై స్టార్‌ హెల్త్‌ సంస్థ రియాక్ట్‌ అయ్యింది. వినియోగదారులకు సంబంధించిన కీలకమైన డేటా భద్రంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది. టెలిగ్రామ్‌ ఫౌండర్‌, సీఈవో పావెల్‌ దురోవ్‌ ను కొన్ని రోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, సైబర్‌ క్రైమ్‌ ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో అజర్‌ బైజాన్‌ ఎయిర్‌ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి టెలిగ్రామ్‌ వ్యవహారాలపై మానిటరింగ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో స్టార్‌ హెల్త్‌ డేటా చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News